Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌, బ్యాట్స్‌మన్‌గా స్మిత్‌ కన్నా కోహ్లీనే బెస్ట్‌: ఛాపెల్‌

Virat Kohli or Steve Smith: Ian Chappell picks his choice between the two
Ian Chappell Picks The Best Between Virat Kohli And Steve Smith | Oneindia Telugu

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ ఇద్దరిలో మేటి బ్యాట్స్‌మన్ ఎవరు? ఈ అంశంపై చాలాకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. జనవరిలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఇద్దరిలో మేటి బ్యాట్స్‌మన్ ఎవరన్న చర్చ తెరమీదకు వచ్చింది. కోహ్లీనే అన్ని ఫార్మాట్లలో బాగా రాణిస్తాడని, స్మిత్‌ టెస్టుల్లో ఆకట్టుకోలేడని చాలా మంది మాజీలు చెప్పారు. తాజాగా ఈ చర్చ మళ్లీ వచ్చింది.

స్మిత్‌ కన్నా కోహ్లీనే బెస్ట్‌:

స్మిత్‌ కన్నా కోహ్లీనే బెస్ట్‌:

ఈ విషయంపై ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ ఛాపెల్‌ ఓ వీడియోలో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ‌కే తన ఓటు వేశాడు. క్రికెట్‌ విశ్లేషకుడు‌ రౌనక్‌ కపూర్.. ఛాపెల్‌తో ఓ వీడియోలో మాట్లాడారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరూ ర్యాపిడ్‌ ఫైర్‌ ఆడుతుండగా.. రౌనక్‌ ఓ ప్రశ్న వేశారు. కోహ్లీ, స్మిత్‌లలో ఎవరు గొప్ప క్రికెటర్‌ అని ఛాపెల్‌ను అడిగారు.‌ కెప్టెన్‌గా చెప్పమంటారా లేదా బ్యాట్స్‌మన్‌గా చెప్పమంటారా అని ఛాపెల్‌ తిరిగి ప్రశ్నించాడు. దానికి రౌనక్‌ మీరే చెప్పండన్నారు. అప్పుడు ఛాపెల్‌.. కోహ్లీని బెస్ట్‌ కెప్టెన్‌, బ్యాట్స్‌మన్‌గా పేర్కొన్నాడు. మరోవైపు ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ కూడా స్టీవ్ ‌వా కన్నా అత్యుత్తమ కెప్టెన్‌ అని పేర్కొన్నాడు.

ఇప్పటికే 70 శతకాలు:

ఇప్పటికే 70 శతకాలు:

విరాట్ కోహ్లీ ఇప్పటికే వన్డేలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీ20ల్లోనూ టాప్‌ 10లో ఉన్నాడు. పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే 70 శతకాలు సాధించాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 27 శతకాలు కోహ్లీ సాధించాడు. మరోవైపు బాల్ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన‌ స్మిత్..‌ 2019 యాషెస్‌ సిరీస్‌తో తిరిగి టెస్టుల్లో పునరాగమనం చేశాడు. యాషెస్‌ సిరీస్‌లో అసాధారణమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిరీస్‌లో 134.2 సగటుతో ఏకంగా 671 పరుగులు చేశాడు.

కోహ్లీకే నా ఓటు అన్న వాగన్:

కోహ్లీకే నా ఓటు అన్న వాగన్:

ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మైఖేల్ వాగన్ మాత్రం తన ఓటు విరాట్ కోహ్లీకే అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లలో విరాట్ కోహ్లీయే మేటి అంటూ వాగన్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ కంటే స్టీవ్ స్మిత్ మేటి ఆటగాడన్న అభిప్రాయంతో వాగన్ విభేదించారు. లెజెండరీ ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ తనను గనక ఎంపిక చెయ్యమంటే.. స్మిత్‌కి కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని తన ఫేవరెట్ మాత్రం కోహ్లీ అని చెప్పాడు.

పోలిక నచ్చదు:

పోలిక నచ్చదు:

కోహ్లీ, స్మిత్‌లో ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్ అనే ప్రశ్నకి సచిన్ అద్భుతమైన సమాధానమిచ్చాడు. 'కోహ్లీ, స్మిత్‌ విషయంలో మనం పోలికలు చూడొద్దు. ఇద్దరు ఎలా ఆడుతున్నారో దాన్ని ఆస్వాదిద్దాం. తమ ఆటతో క్రికెట్‌ ప్రపంచాన్ని మొత్తం అలరిస్తున్నారు. వారి ఆటతో మనకు సంతోషాన్ని అందిస్తున్నారు' అని సచిన్‌ చెప్పాడు. 'సహజంగా నాకు ఒక ఆటగాడితో మరొకరిని పోల్చడం నచ్చదు. నేను ఆడే రోజుల్లో కూడా ఇతర ఆటగాళ్లతో పోల్చేవారు. నన్ను.. బ్రయన్‌ లారా, రికీ పాంటింగ్‌, డాన్‌ బ్రాడ్‌మన్‌, సునీల్‌ గావస్కర్‌లతో పోల్చేవారు' అని సచిన్ తెలిపాడు.

Story first published: Friday, May 1, 2020, 17:38 [IST]
Other articles published on May 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+