Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: అందుకే కెప్టెన్సీని వదిలేశా.. కింగ్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు

Virat Kohli: రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరు వింటేనే ముందుగా బ్యాటింగ్ గుర్తుకొస్తుంది. విరాట్ కోహ్లీ టన్నుల కొద్దీ రన్స్, రికార్టుల మీద రికార్డులతో చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీకి ఆటకు, కెప్టెన్సీకి చాలా కోట్ల కొద్ది అభిమానులు ఉన్నారు. విరాట్ కోహ్లీ ఏ మ్యాచ్ అయినా దూకుడుగా రాణిస్తాడు. కింగ్ కోహ్లీ తన ప్లానింగ్, జట్టును నడిపించడంలో ముందుండి నడిపించే తీరు అద్భుతంగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. టీమిండియా జట్టుతో పాటు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నాడు. కింగ్ కోహ్లీ కెప్టెన్సీకి ఎందుకు దూరంగా ఉంటున్నాడో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ కీలక విషయాలను వెల్లడించాడు. ఆర్సీబీ జట్టు బాధ్యతల నుంచి తాను ఒప్పుకోవడానికి గల కారణాలను కూడా విరాట్ కోహ్లీ పంచుకున్నాడు. అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..ఐపీఎల్ 2016 నుంచి ఐపీఎల్ 2019 వరకు 3 సీజన్లు పాటు తనపై తీవ్రంగా ఒత్తిడి ఉండేదని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఆ మూడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్‌గా, కెప్టెన్‌గా వ్యవహరించానని.. అయితే తన ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాలని తనపై ఒత్తిడి ఉండేదని విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్‌గా విజయవంతం కావడంతో పాటు కెప్టెన్సీలోనూ తనపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాడని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. టీమిండియాతో పాటు ఆర్సీబీ విషయంలోనూ అంచనాలు, ఒత్తిడి ఎక్కువ కావడంతో కెప్టెన్సీకి దూరంగా ఉంటున్నట్లు కింగ్ కోహ్లీ స్పష్టం చేశాడు.

Virat Kohli Opens Up on Why He Stepped Down as Captain Key Insights from King Kohli

బ్యాటింగ్‌తో పాటు సారథిగానూ విజయవంతం కావాలనే అంచనాలతో ఒత్తిడికి గురయ్యానని విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రతి రోజు అదే ఆలోచనతో ఉండేవాడినని.. దీని సరిగ్గా నిర్వహించలేకపోయాలని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినట్లు విరాట్ అసలు విషయాన్ని వెల్లడించాడు. బ్యాటర్‌గా రాణించడం కోసం ఒత్తిడి లేకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విరాట్ తెలిపాడు. ఆటలో ఎక్కువ రోజులు కొనసాగడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పదన్నాడు.

అతను నా జీవితంలో ప్రత్యేకం- విరాట్ కోహ్లీ
ఇషాంత్‌తో నాకు సహజంగానే అనుబంధం ఉందని.. మొదటి రోజు నుంచి కలిసి ఆడినా, ఆడకపోయినా అతడిలో ఎలాంటి మార్పులేదని విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రతి ఒకటి తనతో పంచుకోగలనని.. కాబట్టి ఇషాంత్ నా జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటూ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. తాను టెక్నికల్‍‌గా అంత మంచి ప్లేయర్ కాదని.. సహజంగానే ప్రతిభావంతుడైన ఆటగాడిని కాదని నేనెప్పుడూ సిగ్గపడలేదని విరాట్ చెప్పుకొచ్చాడు. తాను ఆడుతున్నప్పుడు చాలా విషయాలను నేర్చుకుని అభివృద్ధి చెందానన్నాడు. తాను ప్రతి విషయంలో బెస్ట్ ఉండాలని అనుకున్నానని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, May 6, 2025, 13:33 [IST]
Other articles published on May 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+