
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా ధోనీ గురించి కొన్నాళ్లుగా నలుగుతున్న విషయంపై స్పందించాడు. జట్టులోకి కొత్త ఆటగాల్లు వస్తూ ఉంటే.. ధోనీ స్థానం నిలకడగా ఎలా ఉంటుందనే ప్రశ్నకు బదులిచ్చాడు.
'భారత జట్టులో కెప్టెన్ పదవిలో ఉండటం ఎంత కష్టంగా ఉంటుందో.. కొంతకాలంగా చూస్తూనే ఉన్నాను. ఆడేటప్పుడు ఉన్న కష్టం బయటి నుంచి చూసే వాళ్లకి తెలీదు. ఇప్పడు అందరూ అనుకుంటూండవచ్చు జట్టులోకి ఆల్‌రౌండర్ హోదాలో దినేశ్ కార్తీక్ ఉండనే ఉన్నాడు. ఇక ధోనీ రిటైర్ అయినా పరవాలేదని. కానీ, ఎప్పటికీ ధోనీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు' అని తెలిపాడు.
'ఒకవేళ ఎవరో చెప్పారని అలా చేస్తే భారత క్రికెట్ చాలా సమస్యల్లో పడిపోతుంది. ఆ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. జట్టు గెలుపోటములకు గురైనప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్న దానిపై స్పందించాడు. అలా అని ధోనీ జట్టులో శాశ్వతంగా ఉండిపోతాడని లేదు. అందరి అభిప్రాయాలను పరిగణించి, చివరిగా ధోనీకి సమ్మతమైతేనే అతని రిటైర్‌మెంట్ ఖరారు అవుతుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టు అన్ని విధాల సెట్ అయింది' అని తెలిపాడు.
'రాబోయే కాలంలో అవసరమైతే మార్పులు చేస్తాం. ఇప్పటికే ధోనీ టెస్టు మ్యాచ్ ల నుంచి రిటైర్ అయ్యాడు. ఇక వన్డే మ్యాచ్ లకు ఎప్పటి వరకూ ఆడతాడనేది అతని వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. జట్టు గెలుపోటములు గురించి మాట్లాడుతూ.. మేము ఓడిపోతే ఆ విషయంపై పెద్ద చర్చా వేదిక నిర్వహిస్తారు. అదే గెలిచన సందర్భాల్లో కేవలం ఒకటి రెండు వార్తలకు మించి కనిపించవు. కానీ, ఇలాంటివేమీ పట్టించుకోకుండా జట్టు ముందుకుపోతోంది. అని పేర్కొన్నాడు.