న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli: ఆఖరి టెస్ట్ రద్దవ్వడం దురదృష్టకరం!

Virat Kohli opens up for the first time after cancelled 5th Test against England
Virat Kohli Breaks Silence - T20 WC కి ఎంతో ముఖ్యం | IPL 2021, RCB || Oneindia Telugu

దుబాయ్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఆఖరి టెస్ట్ దురదృష్టవశాత్తు రద్దయిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కరోనా వల్ల ఏర్పడిన అనిశ్చితి ఇందుకు కారణమన్నాడు. ఆఖరి టెస్ట్ రద్దవ్వడంతో ముందుగానే భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం యూఏఈకి చేరిన విషయం తెలిసిందే. మహమ్మద్ సిరాజ్‌తో పాటు విరాట్ కోహ్లీ ప్రత్యేక విమానంలో ఆదివారమే యూఏఈకి చేరాడు. ప్రస్తుతం యూఏఈ ప్రభుత్వ నిబంధనల మేరకు 6 రోజుల క్వారంటైన్ పాటిస్తున్నాడు. అయితే తాజాగా ఆర్‌సీ బోల్డ్ డైరీస్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్ రద్దవ్వడంపై తొలిసారి స్పందించాడు.

'దురదృష్టవశాత్తు ఇంగ్లండ్​తో జరగాల్సిన ఐదో టెస్టు ఆడకుండానే ఇక్కడికి రావాల్సివచ్చింది. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనిశ్చితి నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరగొచ్చు. ఐపీఎల్​లోనైనా బలమైన, సురక్షితమైన వాతావరణం ఏర్పాటవుతుందని ఆశిస్తున్నాను. ఐపీఎల్​లో ఇప్పుడు మేం ఆడబోతున్నది చాలా కీలకం. ఆర్సీబీ జట్టుతో పాటు టీ20 ప్రపంచకప్​కు కావాల్సిన భారత ఆటగాళ్లకు ఇదెంతో ముఖ్యం'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇక ఆర్‌సీబీ జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లపై విరాట్ ప్రశంసల జల్లు కురిపించాడు. వారంతా టాప్ క్లాస్ ప్లేయర్లు కావడంతో ఇక్కడికి వచ్చారని తెలిపాడు. లెగ్​-స్పిన్నర్​ వానిందు హసరంగ, సింగపూర్​కు చెందిన బ్యాట్స్​మన్​ టిమ్​ డేవిడ్​ జట్టులోకి వచ్చారు. ఈ మార్పులు జట్టును మరింత బలం చేసాయని కోహ్లీ తెలిపాడు. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు.. ఐపీఎల్​ రెండోదశలో కోల్​కతా నైట్​రైడర్స్​తో తమ మొదటి మ్యాచ్​ను సోమవారం(సెప్టెంబరు 20) ఆడనుంది.

ఇక ఫస్టాప్‌లో దుమ్మురేపిన కోహ్లీసేన..7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన కోహ్లీసేన.. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. ఇక ఆర్‌సీబీ విజయాల్లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 223 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ సైతం 6 ఇన్నింగ్స్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 207 రన్స్ చేశాడు. బౌలింగ్ విభాగంలో పేసర్ హర్షల్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 7 మ్యాచ్‌ల్లో 17 వికెట్లతో టోర్నీ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. హర్షల్ పటేల్ తర్వాత కైల్ జెమీసన్ 7 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు.

Story first published: Monday, September 13, 2021, 22:21 [IST]
Other articles published on Sep 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X