Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: పూణె మ్యాచ్‌లో కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్‌ని చూశారా? (వీడియో)

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పట్టిన క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. కోహ్లీ పట్టిన క్యాచ్ మ్యాచ్ చూస్తున్న వీక్షకులతో పాటు పూణె ఆటగాళ్లను విస్మయానికి గురి చేసింది.

ఊహించని రీతిలో బంతిని అందుకుని విరాట్ కోహ్లీ... పూణె ఆటగాడు రాహుల్‌ త్రిపాఠిని పెవిలియన్‌కు పంపాడు. 9వ ఓవర్‌‌లో పవన్‌ నేగి బౌలింగ్‌‌లో త్రిపాఠి కొట్టిన బంతిని ఎడమవైపుకు డైవ్‌ చేసి కోహ్లి ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టాడు. త్రిపాఠి అలా షాట్‌ కొట్టాడో లేదో కోహ్లీ క్యాచ్‌ పట్టడం, వెంటనే బంతిని గాల్లోకి విసిరేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.

ఎంతో కష్టసాధ్యమైన ఈ క్యాచ్‌ని విరాట్ కోహ్లీ ఊహించనిరీతిలో పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు గాను 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.

మ్యాచ్ అనంతరం 'నేను పట్టిన అరుదైన క్యాచుల్లో ఇది కూడా ఒకటి. ట్రైనింగ్‌‌లో నేను తీసుకున్న శిక్షణ ఇక్కడ ప్రతిఫలించింది' అని మీడియాతో విరాట్ కోహ్లీ చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+