For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫోర్బ్స్‌ జాబితా: కోహ్లీ ఆదాయం, జీతం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. 
 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోన్న 100 మంది అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్‌ ప్రకటించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోన్న 100 మంది అథ్లెట్ల జాబితాను ప్రముఖ ఫోర్బ్స్‌ సంస్థ గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు.

'ది వరల్డ్స్ హైయస్ట్ పెయిడ్ అథ్లెటిక్స్-2017' జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో పుట్ బాల్ ప్లేయర్ 93 మిలియన్‌ డాలర్లతో క్రిస్టియానో ​​రోనాల్డో (పోర్చుగీస్‌) అగ్రస్థానంలో నిలిచారు. విరాట్‌ కోహ్లీ 22 మిలియన్‌ డాలర్ల(రూ.141కోట్లకు పైగా)తో 89వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

కోహ్లీ ఆదాయం 22 మిలియన్‌ డాలర్లు

కోహ్లీ ఆదాయం 22 మిలియన్‌ డాలర్లు

మూడు మిలియన్‌ డాలర్లను జీతంగా అందుకున్న కోహ్లీ మిగతా 19 మిలియన్‌ డాలర్లను ప్రకటనలు, ఇతర ఒప్పందాల ద్వారా అందుకున్నట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది. అలాగే ఐపీఎల్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి 2.3 మిలియన్ డాలర్ల(రూ.14కోట్లకు పైగా) వేతనం పొందినట్టు తెలిపింది. విరాట్ కోహ్లీని ఇండియన్ క్రికెట్ ఫెనోమ్‌గా ఫోర్బ్స్ అభివర్ణించింది.

బ్యాటింగ్ లో రికార్డులు

బ్యాటింగ్ లో రికార్డులు

కోహ్లీ బ్యాటింగ్ లో రికార్డులు సృష్టిస్తున్నాడని కొనియాడింది. కోహ్లీ ఆదాయాలు ఎక్కువగా ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన స్పానర్ షిప్ పోర్టు ఫోలియోలతో వస్తున్నాయని చెప్పింది. 2015లో భారత జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నియమించినప్పుడు, ఈ జాబ్‌ను నిర్వర్తించే అత్యంత పిన్న వయసు ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందినట్టు ఫోర్బ్స్‌ పేర్కొంది.

93 మిలియన్ డాలర్లతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రోనాల్డ్

93 మిలియన్ డాలర్లతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రోనాల్డ్

ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రోనాల్డ్ 93 మిలియన్ డాలర్ల పారితోషికం పొందుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికాకు చెందిన బాస్కెట్‌బాల్‌ ఆటగాడు లీబ్రాన్‌ జేమ్స్‌(86.2 మిలియన్‌ డాలర్లు), అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సి(అర్జెంటీనా, 80మిలియన్‌ డాలర్లు), స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌(64 మిలియన్‌ డాలర్లు), కెవిన్‌ డురంట్‌(అమెరికా) నిలిచారు.

ఒకే ఒక్క మహిళ సెరెనా విలియమ్స్‌

ఒకే ఒక్క మహిళ సెరెనా విలియమ్స్‌

ఈ పారితోషికాల్లో ఆటగాళ్లు 2016 జూన్ నుంచి 2017 జూన్ వరకు పొందిన వేతనాలు, నగదు బహుమతులు, బోనస్ లు ఉన్నాయి. ఫోర్బ్స్‌ ప్రకటించిన టాప్‌ 100 అథ్లెట్లలో ఒకే ఒక్క మహిళకి మాత్రమే చోటు దక్కింది. అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్‌ 27 మిలియన్‌ డాలర్లతో 51స్థానంలో నిలిచింది.

63 మంది ఆటగాళ్లతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్ధానంలో

63 మంది ఆటగాళ్లతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్ధానంలో

గత పన్నెండు నెలల కాలంలో ఆటగాళ్లు అందుకున్న మొత్తాన్ని పరిగణలోనికి తీసుకుని ఈ ర్యాంకులు వెల్లడించినట్లు నిర్వాహకులు తెలిపారు. 21 దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ జాబితాలో స్థానం సంపాదించారు. అందరికంటే అత్యధికంగా 63 మంది ఆటగాళ్లతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్ధానంలో నిలిచింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+