Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భూటాన్‌లో 'బర్త్‌డే బాయ్' కోహ్లీ.. అనుష్కతో విహారం!!

#HappyBirthdayViratKohli : Vitat Kohli Celebrates His 31st Birthday In Bhutan || Oneindia Telugu
Virat Kohli On Vacation With Wife Anushka Sharma in Bhutan Ahead Of 31st Birthday

భూటాన్‌: టీమిండియా కెప్టెన్‌ 'రికార్డుల రారాజు' విరాట్‌ కోహ్లీ మంగళవారం 31వ ఏట ప్రవేశించాడు. తన జీవితంలోని ఈ అద్భుతమైన రోజును సంతోషంగా గడపడానికి భార్య అనుష్క శర్మతో కలిసి విహారానికి వెళ్లాడు. భూటాన్‌లో బర్త్‌డే బాయ్ అనుష్కతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. బర్త్‌డే రోజును కోహ్లీ భూటాన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

భూటాన్‌లో విహారం:

భూటాన్‌లో విహారం:

భూటాన్‌లో విహరిస్తున్న కోహ్లీ, అనుష్క చిత్రాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తొచ్చాయని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పేర్కొంది. భూటాన్‌లోని సేంద్రియ కూరగాయాల మార్కెట్‌, దేవాలయాలు, ప్రకృతి అందాల మధ్య విరుష్క జోడీ విహరించింది. అయితే అనుష్క షేర్‌ చేసిన ఏ చిత్రంలోనూ కోహ్లీ లేకపోవడం గమనార్హం.

కోహ్లీని పుట్టించినందుకు దేవునికి ధన్యవాదాలు:

కోహ్లీని పుట్టించినందుకు దేవునికి ధన్యవాదాలు:

క్రికెటర్లు జన్మదినం, ఇతర పండుగ రోజుల్లో కుటుంబం చెంత ఉండడం చాలా అరుదు. కానీ.. విశ్రాంతి కోహ్లీకి సమయం బాగా కలిసి వచ్చింది. గత సంవత్సరం బర్త్‌డే రోజున విరుష్క జోడీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్‌లో గడిపిన విషయం తెలిసిందే. ఆ రోజు కోహ్లీ బర్త్‌డే సందర్భంగా... 'కోహ్లీని పుట్టించినందుకు దేవునికి ధన్యవాదాలు' అని అనుష్క ట్వీట్‌ చేసింది.

సూపర్‌ 'వి' తొలి ఎపిసోడ్‌ ఈ రోజే:

సూపర్‌ 'వి' తొలి ఎపిసోడ్‌ ఈ రోజే:

కోహ్లీ పుట్టినరోజున స్టార్‌స్పోర్ట్స్‌ సూపర్‌ 'వి' పేరిట రూపొందించిన సిరీస్‌లో తొలి ఎపిసోడ్‌ను మంగళవారం మధ్యాహ్నం 3.30 ప్రసారం చేస్తోంది. 15 ఏళ్ల వయస్సులో పోటీ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి టీమిండియా కెప్టెన్‌ అయ్యే వరకు కోహ్లీ ప్రయాణాన్ని ఈ ఎపిసోడ్లలో వివరించారు. అలాగే చిన్నతనంలో తల్లిదండ్రులు, సోదరి, స్నేహితులు, టీచర్లతో విరాట్‌ సంబంధాలను కూడా చూపించనున్నారు.

ఆదివారాల్లో 11 ఎపిసోడ్‌లు:

ఆదివారాల్లో 11 ఎపిసోడ్‌లు:

సూపర్‌ 'వి'లోని మొదటి ఎపిసోడ్‌ మంగళవారం టెలికాస్ట్‌ కానున్నా.. మిగిలిన 11 ఎపిసోడ్‌లు తదుపరి ఆదివారాలు ఉదయం 9 గంటల నుంచి స్టార్‌ప్లస్‌, స్టార్‌ స్పోర్ట్స్‌, డిస్నీ, మార్వెల్‌ హెచ్‌క్యూ, హాట్‌స్టార్‌లలో ప్రసారమవుతాయి. కోహ్లీ ఎదుర్కొన్న కష్టనష్టాలు, సాధించిన విజయాలను ఈ ఎపిసోడ్లలో వివరిస్తారట.

కోహ్లీకి విశ్రాంతి:

తీరికలేని క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ అతనికి విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉన్నాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు మళ్లీ జట్టుతో కలుస్తాడు. ఈ నెల 14 నుండి మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Story first published: Tuesday, November 5, 2019, 9:36 [IST]
Other articles published on Nov 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+