Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హోటల్లో కోహ్లీకి బోర్ కొడుతోంది, వాడిన ముఖం (ఫోటో)

న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బోర్ కొడుతోందట. నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ప్రస్తుతం విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్ 2-0తో సిరీస్ చేజిక్కించుకుంది. మూడు టెస్టులు పూర్తయ్యాయి.

నాలుగో టెస్టు మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారుతోంది. గురువారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 62/2తో ఉండగా వర్షం ఆరంభమైంది. దీంతో మొదటి రోజు ఆటను మధ్యలోనే నిలిపేశారు. ఆ తర్వాత శుక్రవారం, శనివారం కూడా వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు.

దీంతో హోటల్‌లో బాగా బోర్‌ కొడుతోందని విరాట్‌ కోహ్లి తన హావభావాలు ప్రదర్శిస్తూ ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ టెస్టులో భారత్‌ ఓడినా లేదా మ్యాచ్‌ డ్రాగా ముగిసినా ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లిసేన రెండో స్థానానికి పడిపోతోంది. ఒక పాయింట్‌ తేడాతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌ అగ్రస్థానానికి చేరుకోనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+