న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

10వన్డేలకు ముందే సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

Virat Kohli on the verge of breaking Tendulkars record

వైజాగ్: ఇండియన్ గాడ్ ఆఫ్ క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. స్వదేశంలో వెస్టిండిస్‌తో జరుగుతోన్న ఐదు వన్డేల సిరిస్‌లో ఈ ఘనత నమోదైంది. రెండో వన్డేను మధ్యప్రదేశ్ స్టేడియంలో నిర్వహించాలని భావించిన బీసీసీఐకి ఆటంకాలు ఎదురైయ్యాయి. ఈ క్రమంలో వైజాగ్ వేదికగా రెండో వన్డేను నిర్వహించారు. గతంలో వెస్టిండిస్ జట్టుపై సచిన్ పేరిట రికార్డు ఏంటంటే.. మొత్తం 39 వన్డేలాడి 1,573 పరుగులుగా ఉంది.

1
44267
కోహ్లీ కేవలం 29ఇన్నింగ్స్‌లోనే

కోహ్లీ కేవలం 29ఇన్నింగ్స్‌లోనే

ఇలా భారత్ తరఫున వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఆ రికార్డును కోహ్లీ కేవలం 29ఇన్నింగ్స్‌లోనే పూర్తి చేయడం విశేషం. అక్టోబర్ 21 నుంచి గువహటి వేదికగా ప్రారంభమైన తొలి వన్డేలోనే రికార్డు బద్దలవుతుందని భావించినా.. ఆ రికార్డును వైజాగ్ వేదికగా బ్రేక్ చేశాడు. ఈ రికార్డు బ్రేక్ చేయకముందు వరకూ కోహ్లీ వెస్టిండీస్‌పై 27 వన్డేలాడి కోహ్లి 1,387 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

 మూడో స్థానంలో రాహుల్ ద్రవిడ్

మూడో స్థానంలో రాహుల్ ద్రవిడ్

సచిన్, కోహ్లీల తర్వాత ఈ జాబితాలో మూడో స్థానంలో మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నాడు. విండీస్‌పై 40 వన్డేలాడిన ద్రవిడ్ 42.12 యావరేజితో 1,348 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా వెస్టిండిస్‌పై వన్డేల్లో 1,000కిపైగా పరుగులు చేసిన భారత బ్యాట్స్ మెన్ నలుగురు ఉన్నారు.

ఆటగాళ్లు ఏడో స్థానంలో ధోని

ఆటగాళ్లు ఏడో స్థానంలో ధోని

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్‌తో పాటు సౌరవ్ గంగూలీ (1,142) జాబితాలో ఉన్నారు. ఇక, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 33 వన్డేల్లో 899 పరుగులు చేసి ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.

వెస్టిండిస్ జట్టుపై అత్యదిక పరుగులు చేసిన ఆటగాళ్లు:

సచిన్ టెండూల్కర్ - 1573 runs in 39 ODIs

విరాట్ కోహ్లీ - 1574 runs in 29 ODIs

రాహుల్ ద్రవిడ్ - 1348 runs in 40 ODIs

సౌరవ్ గంగూలీ - 1142 runs in 27 ODIs

అజహరుద్దీన్ - 998 runs in 43 ODIs

యువరాజ్ సింగ్ - 978 runs in 31 ODIs

ధోని - 899 runs in 33 ODIs

 డివిలియర్స్ రికార్డుని సైతం కోహ్లీ బద్దలు

డివిలియర్స్ రికార్డుని సైతం కోహ్లీ బద్దలు

సొంతగడ్డపై వన్డేల్లో అత్యంత వేగంగా 78 ఇన్నింగ్స్‌లలో 4000 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీకి కంటే ముందు ఈ రికార్డుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు అందుకున్నారు. ఈ రికార్డు చేరుకోవడానికి సచిన్‌కు 92 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, ధోనికి 100 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రికార్డుని సైతం కోహ్లీ బద్దలు కొట్టాడు.

Story first published: Wednesday, October 24, 2018, 16:18 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X