For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండిస్‌తో సిరిస్: సచిన్ రికార్డుపై కన్నేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ

India vs West indies 2018 : Virat Kohli Competes With sacin Tendulkar's Record
Virat Kohli on the verge of breaking Sachin Tendulkars record

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డు ఒకటి బద్దలయ్యే రోజు దగ్గరపడింది. ఇందుకు స్వదేశంలో వెస్టిండిస్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరిస్ వేదిక కానుంది. వెస్టిండిస్ జట్టుపై మొత్తం 39 వన్డేలాడి 1,573 పరుగులు చేసిన సచిన్.. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.

అక్టోబర్ 21 నుంచి గువహటి వేదికగా జరిగే తొలి వన్డేతో ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరిస్‌లో ఆ రికార్డుని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు వెస్టిండీస్‌పై 27 వన్డేలాడిన కోహ్లి 1,387 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

సచిన్‌తో పోలిస్తే కోహ్లీనే వెస్టిండీస్‌పై

సచిన్‌తో పోలిస్తే కోహ్లీనే వెస్టిండీస్‌పై

వాస్తవానికి సచిన్‌తో పోలిస్తే కోహ్లీనే వెస్టిండీస్‌పై మెరుగ్గా ఆడినట్లు గణాంకాలు చెప్తున్నాయి. సచిన్ 39 వన్డేల్లో 52.73 యావరేజితో నాలుగు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే విరాట్ కోహ్లీ విషయానికి వస్తే 27 వన్డేల్లోనే 60.30 యావరేజితో నాలుగు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు సాధించాడు.

 మూడో స్థానంలో రాహుల్ ద్రవిడ్

మూడో స్థానంలో రాహుల్ ద్రవిడ్

సచిన్, కోహ్లీల తర్వాత ఈ జాబితాలో మూడో స్థానంలో మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నాడు. విండీస్‌పై 40 వన్డేలాడిన ద్రవిడ్ 42.12 యావరేజితో 1,348 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా వెస్టిండిస్‌పై వన్డేల్లో 1,000కిపైగా పరుగులు చేసిన భారత బ్యాట్స్ మెన్ నలుగురు ఉన్నారు.

 ఆటగాళ్లు ఏడో స్థానంలో ధోని

ఆటగాళ్లు ఏడో స్థానంలో ధోని

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్‌తో పాటు సౌరవ్ గంగూలీ (1,142) జాబితాలో ఉన్నారు. ఇక, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 33 వన్డేల్లో 899 పరుగులు చేసి ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.

వెస్టిండిస్ జట్టుపై వన్డేల్లో అత్యదిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:

వెస్టిండిస్ జట్టుపై వన్డేల్లో అత్యదిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:

* సచిన్ టెండూల్కర్ - 1573 runs in 39 ODIs

* విరాట్ కోహ్లీ - 1387 runs in 27 ODIs

* రాహుల్ ద్రవిడ్ - 1348 runs in 40 ODIs

* సౌరవ్ గంగూలీ - 1142 runs in 27 ODIs

* అజహరుద్దీన్ - 998 runs in 43 ODIs

* యువరాజ్ సింగ్ - 978 runs in 31 ODIs

* ధోని - 899 runs in 33 ODIs

Story first published: Tuesday, October 16, 2018, 15:17 [IST]
Other articles published on Oct 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+