మైదానంలోని కోహ్లీ దూకుడు నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదు

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో మాత్రమే దూకుడుగా ఉంటాడు. మైదానంలోని ఆ దూకుడు నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని బాలీవుడ్ నటి, కోహ్లీ భార్య అనుష్క శర్మ అంటున్నారు. మైదానంలో కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తనను ప్రత్యర్థి ఆటగాడు ఎమన్నా అంటే వెంటనే మాటలతో సమాధానం చెపుతాడు. ఆ తర్వాత తన బ్యాట్‌తో కూడా బదులిస్తాడు. గతేడాది ఆసీస్ పర్యటనలో, ఐపీఎల్-12లో దూకుడుగా ప్రవర్తించి విమర్శలకు గురయ్యాడు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

అత్యంత నెమ్మదస్తుడు కోహ్లీనే:
అయితే కోహ్లీ భార్య అనుష్క శర్మ మాత్రం కోహ్లీని అత్యంత నెమ్మదస్తుడు అని పొగిడేస్తున్నారు. తాజాగా అనుష్క ఓ మీడియాతో మాట్లాడుతూ... 'నేను ఇప్పటివరకు కలిసిన వాళ్లలో అత్యంత నెమ్మదస్తుడు కోహ్లీనే. మైదానం బయట కోహ్లీ నిదానంగా ఉంటాడు. ఈ విషయాన్ని మా స్నేహితులను అడగండి. అయితే ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు' అని అనుష్క తెలిపింది.

నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదు:
'విరాట్ కోహ్లీకి క్రికెట్ అంటే ప్రాణం. దీని కారణంగానే మైదానంలో దూకుడుగా ప్రవర్తిస్తాడు. ఆ దూకుడును నిజ జీవితంలో మాత్రం ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసిన వాళ్లలో కోహ్లీ అత్యంత ప్రశాంతంగా ఉండే వ్యక్తి. నువ్విలా ఎలా ఉండగలవు అని ప్రతిసారి కోహ్లీని అడుగుతుంటా' అని అనుష్క చెప్పారు.

సమయం ఎక్కువగా ఉండదు:
'మా వ్యక్తిగత జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. అయితే కోహ్లీ విదేశీ పర్యటనల నేపథ్యంలో ఇద్దరం తీరికగా గడిపే సమయం ఎక్కువగా ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నా. కోహ్లీ కూడా నా పనికి గౌరవం ఇస్తాడు. వృత్తి పట్ల ఇద్దరికీ అంకిత భావం ఉంది. దీంతో అన్ని అర్ధం చేసుకుంటాం' అని అనుష్క చెప్పుకొచ్చారు. విండీస్ సిరీస్ నేపథ్యంలో విరుష్క జంట ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications