Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

30వ పడిలోకి విరాట్ కోహ్లీ: అఫిషియల్ మొబైల్ యాప్‌ విడుదల

Virat Kohli Official App Launched for Android and iOS on His Birthday

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం 30వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీకి సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన అద్భుతమైన ఆటతీరుతో ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ... రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించాలని కోరుకుంటున్నారు.

కాగా, విరాట్ కోహ్లీ పుట్టినరోజుని పురస్కరించుకుని అధికారిక మొబైల్ యాప్‌ను విడుదల చేశారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై ఈ యాప్ లభిస్తోంది. ఈ యాప్ ద్వారా కోహ్లీ అభిమానులు అతడికి చెందిన తాజా వార్తాలతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సాధించిన అనేక రికార్డులను తెలుసుకోవచ్చు.

ఈ యాప్ ద్వారా కోహ్లీతో నేరుగా నేరుగా సంభాషణ జరపవచ్చు. కోహ్లీకి చెందిన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా ఈ యాప్‌కి అనుసంధానం చేశారు. దీంతో ఆయా సోషల్ మీడియా అకౌంట్లలో కోహ్లీ పోస్ట్ చేసే అప్‌డేట్స్‌ను ఈ యాప్ ద్వారా అభిమానులకు చేరువవుతాయి.

Story first published: Monday, November 5, 2018, 18:38 [IST]
Other articles published on Nov 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+