For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

7 నెలల నిరీక్షణ.. 8 బంతుల్లో నిరాశ!

Virat Kohli: దాదాపు 223 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి, ముఖ్యంగా వన్డే ఫార్మాట్లోకి కింగ్ కోహ్లీ రీ-ఎంటీ అభిమానుల్లో నిరాశను కలిగించింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ డకౌట్ కావడంతో నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. ఆస్ట్రేలియాపై జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ కనీసం తన ఖాతా కూడా తెరవలేకపోయాడు.

కోహ్లీ 8 బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కోహ్లీ సున్నాకు ఔట్ కాగా.. కూపర్ కోనోలీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ రీ-ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసినా.. కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడం వారికి నిరాశ కలిగించింది.

Virat Kohli ODI Comeback Ends in Disappointment Out for a Duck After 223 Days

రోహిత్ శర్మ కూడా విఫలం
విరాట్ కోహ్లీతో పాటు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా 223 రోజుల విరామం తర్వాతే అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అయితే హిచ్ మ్యాన్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. రోహిత్ శర్మ 14 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రోహిత్ ఔటయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ (3.4వ ఓవర్) వేసిన బంతిని ఆడబోయి స్లిప్‌లో రెన్‌షాకు రోహిత్ దొరికిపోయాడు. రోహిత్ ఔట్ కావడం భారత అభిమానుల్లో ఆందోళనను రేకెత్తించింది. అభిమానులు ప్రేమగా రో-కో అని పిలుచుకునే ఇద్దర దిగ్గజాలు వారి ఆశలను అడియాసలు చేశారు. ఈ క్రమంలో వారిద్దరిపై అభిమానులు ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

2027 ప్రపంచ కప్‌పై సస్పెన్స్
అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసిన ఈ ఇద్దరు దిగ్గజాలు తొలి మ్యాచ్‌లో విఫలమవడంపై చర్చ మొదలైంది. రోహిత్, కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతారా లేదా అనే అంశంపై ఇప్పటికే సస్పెన్స్ నెలకొనగా.. ఇలాంటి ప్రదర్శనలు పునరావృతమైతే వారిద్దరూ ప్రపంచ కప్ ఆడటం కష్టంగా మారుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ కప్‌లో చోటు దక్కాలంటే వారు నిలకడగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది.

టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్:

కాగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ మే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు కొద్దిగా ముందుగా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందు 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన వెంటనే టీ20 ఫార్మాట్ నుంచి కూడా ఈ ఇద్దరూ రిటైరైన విషయం తెలిసిందే.

తొలి వన్డే కోసం ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్:
భారత ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ మరియు అర్ష్‌దీప్ సింగ్.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్‌షా, కూపర్ కోనోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హేజిల్‌వుడ్.

Story first published: Sunday, October 19, 2025, 10:42 [IST]
Other articles published on Oct 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+