
86 వన్డేలు ఆడగా
ఇందులో టీమిండియా 86 వన్డేలు ఆడగా 56 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా 27 మ్యాచ్‌ల్లో ఓడింది. టీమిండియా విన్నింగ్ పర్సెంటేజ్ 65.11గా నమోదైంది. జింబాబ్వే, దకిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంకలపై వరుసగా సిరీస్ విజయాలు సాధించింది. గతేడాది ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన వన్డే సిరిస్‌లో గనుక విజయం సాధించి ఉండి ఉంటే టీమిండియా వరుసగా 14 సిరీస్ విజయాలను నమోదు చేసేది.

నాలుగేళ్ల కాలంలో
మొత్తం మీద చూస్తే గత నాలుగేళ్ల కాలంలో 18 సిరీస్‌లో 15 గెలిచి ఐదింటిలో ఓడింది. ఇక, భారత విజయాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీదే సింహాభాగం. 2017లో ధోనీ నుండి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ జట్టుకు వరుస విజయాలను కట్టబెట్టాడు. 2017లో ఇంగ్లాండ్‌పై 2-1తో, విండీస్‌పై 3-1తో, శ్రీలంకపై 5-0తో, ఆసీస్‌పై 4-1తో, కివీస్‌పై 2-1తో, శ్రీలంకపై 2-1తో వన్డే సిరిస్‌లను నెగ్గడంలో కోహ్లీ కీలకపాత్ర పోషించాడు.

వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని
ఈ క్రమంలో కోహ్లీ వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా సఫారీలను వారి సొంతగడ్డపై 5-1తో ఓడించింది. ఈ సిరిస్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ పర్యటనలో కోహ్లీ మూడు సెంచరీలు నమోదు చేశాడు. బౌలింగ్‌లో చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ 33 వికెట్లు తీశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వారి సొంతగడ్డపై ఓడించింది.

ఐదు వన్డేల సిరిస్‌ను 2-3తో
అయితే, వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను 2-3తో చేజార్చుకుని అభిమానులను నిరాశకు గురిచేసింది. నిజానికి ఈ టోర్నీలో టీమిండియా అవసర ప్రయోగాలు చేసింది. ముఖ్యంగా ధోనికి విశ్రాంతి ఇవ్వడం. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది.

మే 25న న్యూజిలాండ్‌తో తొలి వార్మప్ మ్యాచ్
టోర్నీకి ముందు టీమిండియా మే 25న న్యూజిలాండ్‌తో, మే 28న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్ 5న సౌతంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి.


Click it and Unblock the Notifications
