Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సమస్య కాదు, ఆందోళనొద్దు: ఓపెనర్లు విఫలంపై కోహ్లీ

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌లో టీమిండియా ఓపెనర్లు విఫలం చెందడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ భారత ఓపెనర్లను వెనుకేసుకొచ్చాడు. ఓపెనర్లు తిరిగి గాడిలో పడేందుకు గాను కొంత సమయం ఇవ్వాలని సూచించాడు.

'గతంలో మాకు ఓపెనర్ల ఇబ్బంది ఉండేది కాదు. కేవలం మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బాగుంటే, ఓపెనర్లు నిరాశపరిచారు. భారత్‌కు మంచి ఓపెనర్లు ఉన్నారు. ఓపెనర్ల కోసం వేరే అన్వేషణ అనవసరం. ప్రస్తుత ఓపెనర్లు ఫామ్‌లో లేరు. వారికి మరికొంత సమయం ఇవ్వాలి' అని కోహ్లీ పేర్కొన్నాడు.

Virat Kohli

ఓపెనర్లు తిరిగి గాడిలో పడేందుకు కొద్ది సమయం కేటాయిస్తే చాలు దానిని సమస్యగా భావిచండం లేదని కోహ్లీ అన్నాడు. తొందర్లోనే అంతా సర్దుకుంటుందని కోహ్లీ చెప్పాడు. ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో భారత ఓపెనర్లు ముగ్గురూ కలిపి చేసిన 37 పరుగులు మాత్రమే చేశారు.

తొలి రెండు వన్డేల్లో శిఖర్ ధావన్ నిరాశపరిస్తే, మూడో వన్డేలో అతని స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక రోహిత్ శర్మ స్ధానంలో చోటు దక్కించుకున్న కేఎల్ రాహుల్ మూడు వన్డేల్లో పూర్తిగా విఫలమయ్యాడు.

దీంతో భారత ఓపెనింగ్‌పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నప్పటకీ కెప్టెన్ కోహ్లీ మాత్రం వారిని వెనకేసుకొచ్చుకు రావడం విశేషం. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

మూడో వన్డేలో గెలుపు అంచు వరకు వచ్చిన టీమిండియా చివర్లో బోల్తా పడింది. 322 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పోరాడి ఓటమి పాలైంది. ఇంగ్లాండ్‌ సిరిస్‌ విజయంలో టీమిండియా బ్యాటింగ్‌లో ఓపెనర్లు విఫలమైనా టాపార్డర్, మిడిల్ ఆర్డర్ రాణించింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+