For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: ఓపెనర్‌గా కోహ్లీకి నో ఛాన్స్.. యువ ప్లేయర్‌ను తీసుకున్న కేఎల్ రాహుల్!

 Virat Kohli not opening in third ODI KL rahul makes two changes

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో కూడా రాహుల్ త్రిపాఠీ, రజత్ పటీదార్‌కు అవకాశం దక్కలేదు. ఎటూ సిరీస్ పోయింది కదా.. చివరి మ్యాచ్‌లో వాళ్లకు ఛాన్స్ దొరుకుతుందని అంతా అనుకున్నారు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం వాళ్లను బెంచ్‌కే పరిమితం చేశాడు. అయితే యువ ఓపెనర్ ఇషాన్ కిషన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు కల్పించినట్లు తెలిపాడు.

రెండో వన్డేలో రోహిత్‌కు గాయం అవడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియాకు కేఎల్ రాహుల్ సారధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో వరుసగా మూడో మ్యాచులోనూ భారత జట్టు టాస్ ఓడింది. టాస్ నెగ్గిన అనంతరం తాము ముందుగా ఫీల్డింగ్ చేస్తామని బంగ్లాదేశ్ తెలిపింది. అలాగే తమ జట్టులో రెండు మార్పులు చేసినట్లు బంగ్లా కెప్టెన్ లిటాన్ దాస్ చెప్పాడు. నాసుమ్ స్థానంలో తస్కిన్ అహ్మద్, షాంటో స్థానంలో యాసిర్ అలీ ఆడుతున్నట్లు వెల్లడించాడు.

తమ జట్టులో కూడా రెండు మార్పులు చేసినట్లు రాహుల్ వెల్లడించాడు. ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ ఆడుతున్నట్లు తెలిపాడు. గాయంతో జట్టుకు దూరమైన రోహిత్ శర్మ, దీపక్ చాహర్ స్థానాల్లో వీళ్లిద్దరూ ఆడుతున్నారు. రెండో మ్యాచ్‌లో ఓపెనర్‌గా విఫలమైన కోహ్లీ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠీ, రజత్ పటీదార్‌లలో ఒకరికైనా అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ రాహుల్ మాత్రం వాళ్లను బెంచ్‌కే పరిమితం చేసినట్లు తెలిపాడు.

భారత జట్టు: శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.

బంగ్లాదేశ్ జట్టు: లిటాన్ దాస్ (కెప్టెన్), అనాముల్ హక్, యాసిర్ అలీ, షకీబల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, ఆఫిఫ్ హొస్సేన్, మెహదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఎబాదత్ హొస్సేన్.

Story first published: Saturday, December 10, 2022, 11:35 [IST]
Other articles published on Dec 10, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+