Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ నెం.1: రైనాను ఎత్తేసిన యూవీ, టోపీతో(పిక్చర్స్)

మెల్బోర్న్/దుబాయ్‌: ఆస్ట్రేలియా పర్యటనలో ఆతిథ్య జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0తో స్వాధీనం చేసుకున్న టీమిండియా ఆటగాళ్లు ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. ఆదివారం జరిగిన మూడో మ్యాచులో విజయం సాధించిన అనంతరం అజేయంగా నిలిచిన సురేష్ రైనా, యువరాజ్ సింగ్‌లు పరస్పరం అభినందించుకున్నారు.

ఆ తర్వాత రైనాను అమాంతం ఎత్తుకున్న యువరాజ్ విజయానందం వ్యక్తం చేశాడు. అనంతరం టీమిండియా ఆటగాళ్లందరూ మైదానంలోకి చేరి సంబరాలు చేశారు. పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.

ఐసిసి టీ20 ర్యాంకింగ్స్: కోహ్లీనే నెం.1

భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి టీ20ల్లో నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 బ్యాట్స్‌మెన్ల ర్యాంకింగ్స్‌ జాబితాలో 892 పాయింట్లతో కోహ్లి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ అరోన్‌ ఫించ్‌ 868 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కోహ్లి వరుసగా 90, 59, 50 స్కోర్లు చేసి 3-0తో భారత్‌ సిరీస్‌ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లోనే మెరుగైన బ్యాటింగ్‌తో రాణించిన సురేశ్‌ రైనా మూడు స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలవగా.. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నాలుగు స్థానాలను మెరుగుపరుచుకుని 16వ స్థానంలో నిలిచాడు.

టీ20 బౌలింగ్‌ విభాగంలో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 692 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలవగా.. వివాదాస్పద బౌలింగ్‌ శైలితో నిషేధం ఎదుర్కొంటున్న వెస్టిండీస్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ 773 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్‌ మినహా భారత్‌ బౌలర్లు ఎవరూ టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు.

విజయానందం

విజయానందం

ఆదివారం మూడో మ్యాచులోనూ ఆస్ట్రేలియా జట్టుపై గెలుపొంది టీ20 సిరీస్ 3-0 గెలుచుకున్న అనంతరం ట్రోఫీతో టీమిండియా ఆటగాళ్ల ఆనందం.

విజయానందం

విజయానందం

ఆదివారం మూడో మ్యాచులోనూ ఆస్ట్రేలియా జట్టుపై గెలుపొంది టీ20 సిరీస్ 3-0 గెలుచుకున్న అనంతరం ట్రోఫీతో టీమిండియా ఆటగాళ్ల ఆనందం.

విజయానందం

విజయానందం

మూడో మ్యాచ్ గెలిచిన అనంతరం మైదానంలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కోహ్లీ-యువరాజ్ సరదా.

విజయానందం

విజయానందం

3-0తో టీ20 సిరీస్‌ను గెలుచుకున్న అనంతరం ట్రోఫీతో విరాట్ కోహ్లీ.

విజయానందం

విజయానందం

మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ విరాట్ కోహ్లీని అభినందిస్తున్న యవరాజ్ సింగ్.

విజయానందం

విజయానందం

డ్రెస్సింగ్ రూంలో విజయానందంతో టీమిండియా ఆటగాళ్లు.

విజయానందం

విజయానందం

మ్యాచ్ గెలిచిన అనంతరం మైదానంలో రైనాను ఎత్తుకుని యువరాజ్ సంబరాలు.

విజయానందం

విజయానందం

సీనియర్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, ఆశీష్ నెహ్రాల సెల్ఫీ.

విజయానందం

టీ20 ట్రోఫీతో రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్. రోహిత్‌ను అభినందిస్తూ హర్భజన్ ట్వీట్.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English:
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+