Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Independence Day: సరికొత్త ఛాలెంజ్‌కు తెరలేపిన కోహ్లీ (వీడియో)

Captain Virat Kohli's New Challenge On Behalf Of August 15
Virat Kohli new veshbhusha will unite us all this Independence Day

లండన్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఛాలెంజ్ అనే పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఫిట్‌ ఇండియా, కికీ‌ ఛాలెంజ్‌లు ప్రాచూర్యం పొందాయి. ఫిట్ ఇండియా ఛాలెంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కేంద్ర క్రీడల మంత్రి శ్రీకారం చుట్టిన ఈ ఛాలెంజ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్యుడి వరకు స్వీకరించారు.

ఎందుకంటే ఈ ఛాలెంజ్ ఆరోగ్యంపై తీసుకోవాల్సిన శ్రద్ద గురించి చెప్పింది కాబట్టి. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో కొత్త ఛాలెంజ్‌కు స్వీకారం చుట్టాడు. భారత సంప్రదాయలపై విస్తృత ప్రచారం కల్పించాలని కోహ్లీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా #Veshbhusha అనే ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టాడు.

స్వాతంత్ర్యం దినోత్సం సందర్భంగా

స్వాతంత్ర్యం దినోత్సం సందర్భంగా

ఈ చాలెంజ్‌కు సంబంధించి ఓ వీడియోను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘తుమ్‌ ముజో కౌన్‌ దో తుమ్హే ఆజాదీ దూంగా' (మీరు మీ రక్తాన్ని ఇవ్వండి.. నేను స్వాతంత్ర్యం తెస్తాను) అనే సుభాష్‌ చంద్రబోస్‌ సూక్తిని చెబుతూ.. చిన్నప్పటి నుంచి ఈ సూక్తులు వింటున్నామని, స్వాతంత్ర్యం దినోత్సం సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించి భారత సంప్రదాయన్ని చాటుదామని కోహ్లీ పిలుపునిచ్చాడు.

ఇతరులకు ఛాలెంజ్ విసరండి

ఆగస్టు 15రోజున సంప్రదాయంగా సిద్దమై ఆ ఫొటోలను వేష్‌బుషా యాష్‌ ట్యాగ్‌తో అప్‌లోడ్‌ చేసి ఇతరులకు ఛాలెంజ్ విసరాలని కోహ్లీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తాను ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, రిషబ్‌ పంత్‌లకు ఈ ఛాలెంజ్ విసురుతున్నట్లు కోహ్లీ ఆ వీడియోల పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు

గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో లార్డ్స్ టెస్టుని కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండో టెస్టు కోసం టీమిండియా లార్డ్స్‌కు చేరుకుంది.

లార్డ్స్ పిచ్‌ను పరిశీలించిన కోచ్ రవిశాస్త్రి

లార్డ్స్ పిచ్‌ను పరిశీలించిన కోచ్ రవిశాస్త్రి

ఇందులో భాగంగా మంగళవారం భారత ఆటగాళ్లు లార్డ్స్‌ మైదానంలో సాధన చేశారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి లార్డ్స్ పిచ్‌ను పరిశీలించాడు. పిచ్‌ గురించి క్యూరేటర్‌ను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు. ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది. మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది.

Story first published: Wednesday, August 8, 2018, 14:25 [IST]
Other articles published on Aug 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+