INDvsAUS : కోహ్లీ అవుటైంది అందుకే.. విరాట్ కెరీర్‌లో ఇలా జరగలేదన్న మాజీ దిగ్గజం!

ఇండోర్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతి కష్టం మీద 22 పరుగులు చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా కేవలం 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో చాలా మంది అభిమానులు మండి పడుతున్నారు. ఈ క్రమంలో అసలు కోహ్లీ ఎందుకు అవుటయ్యాడో మాజీ దిగ్గజం పార్థివ్ పటేల్ వెల్లడించాడు.

ఎప్పుడూ ఇలా అవుటవలేదు..
విరాట్ కోహ్లీ ఇంతకు ముందు ఎన్నడూ షాట్ సెలెక్షన్ కారణంగా అవుటవలేదని, కానీ ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో తను ఎంచుకున్న షాట్ కారణంగానే అవుటయ్యాడని పార్థివ్ అభిప్రాయపడ్డాడు. 'విరాట్ ఎప్పుడూ అవుటయ్యేలా ఈసారి అవుటవలేదు. తన వికెట్ చాలా విలువైందని నమ్మే అతను ఇలాంటి లూజ్ షాట్స్ సామాన్యంగా ఆడడు. రెండో టెస్టులో అతని ఆట ఒకసారి గుర్తుచేసుకుంటే.. ఇలా అతను అవుటవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది' అని పార్థివ్ వివరించాడు. కునేమన్ వేసిన బంతిని బ్యాక్‌ఫుట్‌పై ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లీ ఎల్బీగా అవుటైన సంగతి తెలిసిందే.

అలాంటి షాట్ ఎవరూ ఆడరు..
'చిట్టచివరకు ఇదంతా షాట్ సెలెక్షన్‌కు చేరుతుంది. అవుటైన తర్వాత కోహ్లీ ఎక్స్‌ప్రెషన్ చూస్తే అతను తన షాట్ సెలెక్షన్ మీద ఎంత డిసప్పాయింట్ అయ్యాడో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. తను ఆడిన షాట్ ఈ పిచ్ మీద ఆడాల్సిన షాట్ కాదని అతనికి తెలుసు' అని స్పష్టం చేశాడు. భారత ఆటగాళ్లలో చాలా మందికి మంచి ఆరంభాలు లభించాయని, కానీ వాటిని భారీ స్కోర్లుగా మలుచుకోవడంలో మాత్రం వీళ్లు విఫలమయ్యారని పార్థివ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి వికెట్‌పై అదే చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు.

అదే జరిగితే ఆ మజానే వేరు..
రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా ముందు కేవలం 76 పరుగుల టార్గెట్ నిలిచింది. ఇది చూస్తే కచ్చితంగా ఈ మ్యాచ్ ఆసీస్‌దే అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ భారత్ వద్ద ఛాన్స్ ఉందని పార్థివ్ నమ్ముతున్నాడు. 'ఈ స్కోరును కనుక భారత్ డిఫెండ్ చేసుకుంటే అదొక పెద్ద అచీవ్‌మెంట్ అవుతుంది. అదే కనుక జరిగితే భవిష్యత్తులో చాలా కాలంపాటు ఈ మ్యాచ్ అందరికీ గుర్తుండిపోతుంది. ఇలా లో స్కోరింగ్ మ్యాచులు ఎంతలా గుర్తుండిపోతాయో మనం ఇంతకుముందు కూడా చూశాం కదా' అని పార్థివ్ పేర్కొన్నాడు. మరి మూడో రోజు ఆటలో ఆసీస్‌ను భారత స్పిన్నర్లు ఎలా కట్టడి చేస్తారో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications