ప్రాక్టీస్ సెషన్లో దంచికొట్టిన విరాట్ కోహ్లీ.. గడ్డు రోజులు పోయి గుడ్ డేస్ వచ్చినట్టే..!

ఆసియాకప్ - 2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం టీమిండియా తలపడబోతుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ విషయంలో మరో చర్చనీయాంశ విషయమేంటంటే విరాట్ కోహ్లీ కమ్ బ్యాక్. భారత స్టార్ కోహ్లీ పాకిస్థాన్‌పై వీరోచితంగా ఆడతాడనే సంగతి తెలిసిందే. కోహ్లీ బెస్ట్ ఇన్నింగ్స్ అలాగే అత్యుత్తమ స్కోరు 183 పాకిస్థాన్ మీదే.. ఆసియా కప్‌లో చేశాడు. ఆసియా కప్‌లో కోహ్లీకి తిరుగులేదు. కాబట్టి గత కొంత కాలంగా పేలవ ఫామ్‌లో ఉన్న అతను తిరిగి తన మునుపటి ఆటను ప్రదర్శించడానికి ఆసియాకప్ టోర్నీలోని పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ మంచి అవకాశంగా ఉంది. ఇకపోతే వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు కోహ్లీ విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఆసియాకప్ కోసం టీమిండియా బుధవారం తన మొదటి ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. నెట్ సెషన్‌లలో భారత ప్లేయర్లు చెమటోడ్చారు. ఇక కోహ్లీ సైతం తీవ్రంగా శ్రమించాడు. నెట్ సెషన్‌లో కోహ్లీ మునుపటి షాట్లను స్వేచ్ఛగా ఆడుతూ కన్పించాడు. భారత స్పిన్నర్ల బౌలింగ్లో చాలా ఈజీగా షాట్లు ఆడాడు. కోహ్లీ ఉత్తేజకరమైన షాట్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. యుజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ తదితర స్పిన్నర్ల బౌలింగ్లో కోహ్లీ ఎంచక్క తన మార్క్ షాట్లు ప్రాక్టీస్ చేస్తూ కన్పించాడు. అతని ప్రాక్టీస్ బట్టి చూస్తే కోహ్లీకి గడ్డు రోజులు పోయి గుడ్ డేస్ వచ్చాయనిపిస్తుంది. కోహ్లీ చివరిసారిగా ఇంగ్లాండ్ పర్యటనలో ఆడాడు. అక్కడ అన్ని ఫార్మాట్లలో కలిపి ఆరు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ అత్యధిక స్కోరు 20పరుగులు మాత్రమే.
ఇక ప్రాక్టీస్ సెషన్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్, కోహ్లీ కలిసి కాసేపు ముచ్చటించుకోవడం విశేషం. ఇద్దరు అత్యుత్తమ బ్యాటర్లు ఇలా స్పోర్టివ్ నెస్‌తో మెలగడం చూడ్డానికి ఎంతో స్పోర్టివ్ నెస్ అనిపించింది. ఇకపోతే గతేడాది టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ 10వికెట్ల తేడాతో ఇండియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ఏడాది ఆసియా కప్ ముందు పాకిస్థాన్, ఇండియాకు భారీ షాకులు తగిలాయి. పాక్ ప్రముఖ పేసర్ షాహీన్ అఫ్రిది, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీకి దూరమయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications