Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లి తన స్థాయిని తగ్గించుకోవాలి- అంబటి రాయుడు

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు తీవ్ర వ్యాఖ్యలను చేస్తూనే ఉన్నాడు. తాజాగా కోహ్లి గురించి మరోసారి విశ్లేషిస్తూ రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే దీనిపై లైవ్‌లోనే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, స్పోర్ట్స్ యాంకర్ మయంతి లాంగర్ తీవ్రంగా తప్పుపట్టారు.

ఐపీఎల్-2024లో ఆర్సీబీ-సీఎస్కే ఆఖరి లీగ్ మ్యాచ్ ముగిసిన అనంతరం రాయడు రచ్చ లేపుతున్నాడు. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్కేను మట్టికరిపించి బెంగళూరు తదుపరి దశకు దూసుకెళ్లింది. అప్పటి నుంచి చెన్నై మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఆర్సీబీ, కోహ్లిని లక్ష్యంగా చేసుకుంటూ ఘూటు వ్యాఖ్యలు చేస్తున్నాడు. కోహ్లిని విమర్శించడం, ఆర్సీబీ ఓడిపోతే రాయుడు సంబరాలు చేసుకోవడం గమనార్హం.

Rayudu made controversial comments analyzing Kohli once again

దీంతో రాయుడు పట్ల నెట్టింట వ్యతిరేకత వస్తుంది. అయితే తాజాగా రాయుడు మరోసారి కోహ్లి గురించి ప్రస్తావించాడు. కోహ్లి తన ఆట స్థాయిని తగ్గించుకోవాలని, అప్పుడే ఆర్సీబీలో యువ క్రికెటర్లు ఒత్తిడి లేకుండా ఆడతారని అభిప్రాయపడ్డాడు. ''విరాట్ కోహ్లి అత్యున్న ప్రమాణాలు నెలకొల్పాడు. అయితే తన జట్టులో ఉన్న యువ ఆటగాళ్లకు ఇది కష్టంగా మారుతుంది. ఆ స్థాయిలో ప్రదర్శన వాళ్లు అందుకోలేకపోతున్నారు. ఆ ప్రమాణాలతో కోహ్లి తనలా జట్టు ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాడు'' అని రాయుడు అన్నాడు.

దానికి కెవిన్ పీటర్సన్ బదులిస్తూ.. అదేమి ప్రతికూలంగా మారదని, యువకులకే మేలే జరుగుతుందని అన్నాడు. రాయుడు స్పందిస్తూ కోహ్లిలా ఎవరూ ఉండలేరని, కానీ కోహ్లిలా అవ్వడానికి ట్రై చేస్తూ భారాన్ని ఎదుర్కొంటారని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో మయంతి లాంగర్ కూడా ఏకీభవించలేదు. ఆర్సీబీలో యువ ఆటగాడు రజత్ పటిదార్ సత్తాచాటుతున్నాడని తెలిపారు.

దానికి అంబటి రాయడు రియాక్ట్ అయ్యాడు. ''రజత్ పటిదార్.. రజత్ పటిదార్ మాత్రమే అవ్వగలడు. కోహ్లి కాలేడు. ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. జట్టులో 11 మంది కోహ్లిలు ఉండలేరు. ఓ కోహ్లి, మిగిలిన పది మంది ఆటగాళ్లు ఉంటారు. వాళ్లకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. బలాలు,బలహీనతలు ఉంటాయి. ఉన్న వనరులను చక్కగా ఉపయోగించుకునేలా ఆర్సీబీ ప్రయత్నించాలి''

''తొలి సీజన్‌లోనే జట్టును గెలిపిస్తారని ఆశించకూడదు. కాస్త సమయం ఇవ్వాలి. మ్యాచ్ విన్నర్‌గా వాళ్లు ఎదిగేలా చూడాలి. ఇక యువకులను ప్రోత్సహించడం, విడిచిపెట్టడం వంటి విషయాల కోసం విరాట్ కోహ్లి తన ప్రమాణాలను తగ్గించుకోవాలి'' అని రాయుడు అన్నాడు.

Story first published: Tuesday, May 28, 2024, 12:12 [IST]
Other articles published on May 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+