Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఒక్క అడుగు.. చరిత్ర సృష్టించనున్న కోహ్లీ!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరి కళ్లు ఐపీఎల్ 2025పైనే ఉంది. మరో 8 రోజుల్లో ఈ మెగా లీగ్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ హిస్టరీలో గ్రేటెస్ట్ బ్యాటర్స్ లో ఒకరైన విరాట్ కోహ్లీకి.. ఈ సీజన్ లో ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక్క అడుగు దూరంలో...
విరాట్ కోహ్లీ కెరీర్ లో 250 ఐపీఎల్ మ్యాచులు ఆడి 8,004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత 17 ఏళ్లగా ఒకే ఫ్రాంఛైజీకి (ఆర్సీబీ) ప్రాతినిథ్యం వహిస్తూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పుడు అతడు 18వ సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే విరాట్ ఈ టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక్క సెంచరీ దూరంలోనే ఉన్నాడు.

తొలి క్రికెటర్ గా ఘనత..
ప్రస్తుతం టీ20 క్రికెట్ లో భారత్ తరఫున అత్యధిక సెంచరీల నమోదు చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. అందులో 8 ఐపీఎల్ లో బాదగా.. ఒకటి అంతర్జాతీయ సెంచరీ. ఆ అంతర్జాతీయ శతకాన్ని 2022లో టీ20 ఆసియా కప్ లో అప్ఘానిస్థాన్ పై బాదాడు. ఓవరాల్ గా అత్యధిక టీ20 సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ (22) అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 11 శతకాలతో ఉండగా, విరాట్ 9 శతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు కోహ్లీ ఐపీఎల్ లో మరో సెంచరీ బాదితే టీ20 క్రికెట్ లో బాబర్ అజామ్ తో కలిసి అత్యధిక సెంచరీల రికార్డును సమం చేసినట్టువుతుంది. అలాగే భారత్ తరఫున 10 సెంచరీలు బాదిన తొలి ప్లేయర్ గానూ నిలుస్తాడు. పైగా రీసెంట్ గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీతో అతడు ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్ లో (మార్చి 22) డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ తో ఆర్సీబీ తలపడనుంది.

Virat Kohli Needs One Century In IPL 2025 to achieve most centuries in T20 cricket
Photo Credit: .
Story first published: Thursday, March 13, 2025, 18:18 [IST]
Other articles published on Mar 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+