
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను ఈ బ్యాటింగ్ దిగ్గజం తన పేరు మీద లిఖించుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అంటే రికార్డులు, రికార్డులు అంటే విరాట్ కోహ్లీ అనేంతగా అతని హవా సాగుతుంది. ఇటీవల కాలంలో కోహ్లీ సెంచరీ చేయలేదనే మాటే కానీ, ఎన్నో సార్లు జట్టుకు విలువైన పరుగులు చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఓ సూపర్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్‌లో మరో 73 పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3227 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. దీంతో నేడు కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరబోయే టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ రికార్డు అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతని ఖాతాలో 3299 పరుగులు ఉన్నాయి. 3197 పరుగులతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే రోహిత్‌కు కూడా నేడు జరిగే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు రోహిత్ శర్మ సెంచరీ సాధించాల్సి ఉంటుంది. అంటే అతను మరో 103 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీట్వంటీ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 3197 పరుగులు ఉన్నాయి.
కాగా కోల్‌కతా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా భారత జట్టు చివరి 6 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. పైగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. దీనికి తోడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడిన సిరీస్‌లు ఏవి కూడా టీమిండియా ఇప్పటివరకు ఒక్కటి కూడా ఓడిపోలేదు. దీంతో ఈ సిరీస్‌లోనూ హిట్‌మ్యాన్ ఆ రికార్డును కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.