For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs West Indies: చరిత్ర సృష్టించ‌డానికి చేరువ‌లో కోహ్లీ, రోహిత్‌.. నేడు రికార్డులు బ‌ద్ద‌ల‌య్యేనా!

Virat Kohli needs 56 runs and Rohit Sharma 63 runs to become the highest run scorer in the T20 format.
IND vs WI 2nd T20 : Kohli VS Rohit Clash For Biggest T20I Record | Oneindia Telugu

నేడు వెస్టిండీస్‌తో జ‌రిగే టీ20 మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్ర‌స్తుత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించానికి చేరువ‌లో ఉన్నారు. నేటి మ్యాచ్‌లో వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒకరికి అంత‌ర్జాతీయ‌ టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచి చ‌రిత్ర సృష్టించేదుకు అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా న్యూజిలాండ్ బ్యాట‌ర్ మార్టిన్ గుప్తిల్ ఉన్నాడు. దీంతో నేటి మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్‌లో ఎవ‌రో ఒక‌రు ల‌క్ష్యాన్ని చేరుకుంటే ఈ రికార్డు బ‌ద్ద‌లు అవ‌డం ఖాయ‌మ‌నే చెప్పుకోవాలి. దీంతో నేడు జ‌రిగే మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్ల‌తో ఎదురు చూస్తున్నారు.

 మార్టిన్ గుప్తిల్ పేరుపై రికార్డు

మార్టిన్ గుప్తిల్ పేరుపై రికార్డు

ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు న్యూజిలాండ్ ఓపెన‌ర్ మార్టిన్ గుప్తిల్ పేరు మీద ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు త‌న కెరీర్‌లో 112 మ్యాచ్‌లు ఆడిన గుప్తిల్ 32 స‌గ‌టుతో 3299 ప‌రుగులు చేశాడు. ఇందులో 2 సెంచ‌రీలు, 20 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక ప‌రుగులు 105. కాగా 35 ఏళ్ల మార్టిన్ గుప్తిల్ ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కొన‌సాగుతున్నాడు.

కోహ్లీకి కావాల్సిన ప‌రుగులు

కోహ్లీకి కావాల్సిన ప‌రుగులు

మార్టిన్ గుప్తిల్‌ను అధిగ‌మించి అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచేందుకు ప్ర‌స్తుతం టీమిండియా వెట‌ర‌న్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ మ‌రో 56 ప‌రుగులు కావాల్సి ఉంది. కెరీర్లో ఇప్ప‌టివ‌ర‌కు 96 టీ20 మ్యాచులు ఆడిన కోహ్లీ 51 స‌గ‌టుతో 3244 ప‌రుగులు చేశాడు. ఇందులో 29 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా అత్య‌ధిక స్కోర్ 94 ప‌రుగులు.

రోహిత్‌కు కావాల్సిన ప‌రుగులు

రోహిత్‌కు కావాల్సిన ప‌రుగులు

న్యూజిలాండ్ ఓపెన‌ర్ మార్టిన్ గుప్తిల్‌ను అధిగ‌మించి అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచేందుకు ప్ర‌స్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు మ‌రో 63 ప‌రుగులు కావాలి. త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 120 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 33 స‌గ‌టుతో 3237 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 118 ప‌రుగులు. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు, అత్య‌ధిక సార్లు 50కి పైగా ప‌రుగులు చేసిన రికార్డు రోహిత్ శ‌ర్మ పేరు మీద ఉంది.

నేడే రెండో టీ20

నేడే రెండో టీ20

భార‌త్, వెస్టిండీస్ మ‌ధ్య కోల్‌క‌తా వేదిక‌గా నేడు రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు సిద్ధ‌మ‌య్యాయి. బుధ‌వారం జరిగిన తొలి టీ20లో గెలిచిన టీమిండియా జోరు మీద ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. వెస్టిండీస్ మాత్రం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌సై ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవాల‌ని భావిస్తోంది.

Story first published: Friday, February 18, 2022, 12:32 [IST]
Other articles published on Feb 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+