Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravi Shastri: తిరిగి స‌త్తా చాట‌డానికి విరాట్ కోహ్లీకి 2-3 నెల‌లు విశ్రాంతి అవ‌స‌రం

Virat Kohli needs 2-3 months rest: Ravi Shastri
Kohli Support System Is Back : Is Ganguly a Bad Player ? Asks Ravi Shastri | Oneindia Telugu

ఇటీవ‌ల కాలంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట‌ర్‌గా స్థాయికి త‌గ్గ‌ట్టు రాణించ‌లేక‌పోతున్నాడు. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచ‌రీ చేసి కూడా చాలా కాలం అయిపోయింది. ఈ నేప‌థ్యంలో క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీకి రెండు, మూడు నెల‌లు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని టీమిండియా మాజీ హెడ్‌కోచ్ ర‌విశాస్త్రి అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ విశ్రాంతి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ తిరిగి త‌న అత్యుత్త‌మ ఫామ్‌తో రాణించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపాడు. అలాగే జ‌ట్టులో విరాట్ కోహ్లీ సాధార‌ణ ఆట‌గాడిగా కొన‌సాగాలని చెప్పిన ఆయ‌న‌.. అత‌నిలో మ‌రో 5 సంవ‌త్స‌రాలు ఆట మిగిలి ఉంద‌ని చెప్పాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ర‌విశాస్త్రి ఈ వ్యాఖ్య‌లు చేశాడు.

స‌చిన్, ధోని వంటి వాళ్లు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నారు

స‌చిన్, ధోని వంటి వాళ్లు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నారు

అలాగే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డంపై కూడా షోయ‌బ్ అక్త‌ర్ యూట్యూబ్ ఛానెల్‌లో ర‌విశాస్త్రి స్పందించాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీపై ఒత్తిడి ఉంద‌ని, అదే స‌మ‌యంలో ఇక్క‌డ ఎవ‌రూ శాశ్వ‌తం కాద‌ని ఆయ‌న అన్నాడు. అలాగే అవ‌కాశాల కోసం ఇత‌రులు కూడా ఎదురుచూస్తున్నార‌న్నాడు. క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించ‌డానికి సునీల్ గ‌వాస్క‌ర్, స‌చిన్ టెండూల్క‌ర్, మ‌హేంద్ర‌సింగ్ ధోని వంటి గొప్ప గొప్ప ఆట‌గాళ్లు కూడా కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డం తాను చూశాన‌ని ఆయ‌న తెలిపాడు. ఇక టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ స‌మ‌యానికి 94 మ్యాచ్‌లు ఆడిన ధోని.. ఇంకో 10- 15 మ్యాచ్‌లు సునాయ‌సంగా ఆడ‌గ‌ల‌డ‌ని, కానీ ఆ స‌మ‌యంలో అత‌ను టెస్టుల నుంచి త‌ప్పుకుని ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌పై పూర్తిగా దృష్టి సారించాడ‌ని ర‌విశాస్త్రి గుర్తు చేశాడు.

కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలి

కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలి

"ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ వ‌య‌స్సు 33 సంవ‌త్స‌రాలు. అత‌ను ఇంకో 5 సంవ‌త్స‌రాలు క్రికెట్ ఆడ‌గ‌ల‌డు. అత‌ను ప్ర‌శాంతంగా ఆట‌పై దృష్టి పెట్ట‌గ‌ల‌డు. ఇందు కోసం కోహ్లీ 2 నుంచి 3 నెల‌లు అంటే ఒక సిరీస్ నుంచైనా త‌ప్పుకుని విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి విరాట్ కోహ్లీకి మంచి చేస్తుంది. అప్పుడు 3 నుంచి 4 సంవ‌త్స‌రాలు అత్యుత్త‌మంగా రాణించ‌గ‌ల‌డు. మాన‌సికంగానూ దృఢంగా ఆట‌గాడు. బ్యాట‌ర్‌గా జ‌ట్టులో

త‌న పాత్ర ఏమిటో కోహ్లీకి బాగా తెలుసు. నేను పాత విరాట్ కోహ్లీని చూడాల‌నుకుంటున్నాను. కోహ్లీ టీమ్ ప్లేయ‌ర్‌గా ఆడి దేశం కోసం మ్యాచ్‌లు గెల‌వాల‌ని కోరుకుంటున్నాను." అని ర‌విశాస్త్రి తెలిపాడు.

ఆశ్చ‌ర్యం క‌ల్గించింది

ఆశ్చ‌ర్యం క‌ల్గించింది

కెప్టెన్సీని వ‌దులుకోని బ్యాటింగ్‌పై దృష్టి పెట్ట‌లానుకున్న విరాట్ కోహ్లీ నిర్ణ‌యాన్ని ర‌విశాస్త్రి స‌మ‌ర్ధించాడు. బ‌యోబ‌బుల్ వంటి వాతావ‌ర‌ణంలోనూ టీమిండిమా 3 ఫార్మాట్ల‌లో అగ్ర‌గామిగా నిలిచింద‌న్నాడు. విరాట్ కోహ్లీ వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుని మంచి ప‌ని చేశాడని చెప్పాడు. అయితే టెస్టు కెప్టెన్సీ త‌ప్పుకోవ‌డం త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని తెలిపాడు.

కోహ్లీకి అద్భుత‌మైన రికార్డు

కోహ్లీకి అద్భుత‌మైన రికార్డు

తాను కోచ్‌గా, కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా టెస్టు క్రికెట్‌లో 5 సంవ‌త్స‌రాలు నంబ‌ర్ 1 స్థానంలో ఉన్న‌ద‌ని గుర్తు చేశాడు. అలాగే ఒక సిరీస్ ఓట‌మితోనే కోహ్లీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని తాను అనుకోవ‌డం లేద‌ని చెప్పాడు. అయితే తాను ఒక క్రికెటర్ నిర్ణ‌యాన్ని గౌర‌విస్తాన‌ని తెలిపాడు. 68 టెస్ట్ మ్యాచ్‌ల్లో 40 మ్యాచ్‌లు గెలిచిన అద్భుత‌మైన రికార్డు కోహ్లీకి ఉంద‌ని ర‌విశాస్త్రి చెప్పాడు. కాగా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓట‌మి అనంత‌రం కోహ్లీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న‌సంగ‌తి తెలిసిందే.

Story first published: Wednesday, January 26, 2022, 21:34 [IST]
Other articles published on Jan 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+