For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆ ఘనతను సాధిస్తాడా?

IND vs PAK: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో భారీ రికార్డును సాధించడానికి ఇంకా 15 పరుగులు అవసరం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ లో విరాట్ ఆ ఘనతను సాధిస్తాడా?. దీని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డేల్లో 14,000 పరుగులు పూర్తి చేసుకోవడానికి విరాట్ కోహ్లీకి ఇంకా కేవలం 15 పరుగులు అవసరం. ఈ 15 పరుగులు సాధిస్తే.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించనున్నాడు.

రన్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 298 వన్డేలు ఆడి, 286 ఇన్నింగ్స్ లలో 13,985 పరుగులు చేశాడు. వన్డేల్లో కోహ్లీ బ్యాటింగ్ సగటు 57.78 శాతం కాగా.. 50 సెంచరీలు, 73 అర్థ సెంచరీలు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో 15 కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే విరాట్ కోహ్లీ 14 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.

Virat Kohli needs 15 runs to complete 14 000 runs in ODIs Will he Achieve Against Pakistan

ఇంతకు ముందు ప్రపంచస్థాయిలో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే ఈ మైలురాయిని సాధించారు. 2006లో సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్ లలో 14 వేల పరుగులు సాధించాడు. 2015లో కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్ లలో 14 వేల వన్డే పరుగులు పూర్తి చేశాడు.

విరాట్ కోహ్లీ పాకిస్థాన్ పై ఈ మైలురాయిని చేరుకుంటే కేవలం 286 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించిన వాడవుతాడు. ఇది కాకుండా ఇది ప్రపంచ రికార్డు అవుతుంది. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఇప్పటికే ఉంది. విరాట్ కోహ్లీ వన్డేల్లో 50 శతకాలు సాధించి సచిన్ టెండూల్కర్(49) రికార్డును బద్ధలు కొట్టాడు.

2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఈ ఘనత సాధించబడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఈ మైలురాయిని సాధిస్తాడా అని.. అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ లో ఉన్నప్పటికీ.. ఈ మైలురాయి కింగ్ కోహ్లీకి ఉత్సాహాన్నిస్తుంది. పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో అర్థ శతకం లేదా సెంచరీ చేస్తాడా.. అని అభిమానులు ఉత్కంఠతో వేచి చూస్తున్నారు.

Story first published: Saturday, February 22, 2025, 11:54 [IST]
Other articles published on Feb 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+