Virat Kohli : లిస్టులో పడిపోతున్న కోహ్లీ ర్యాంక్.. కింగ్ మళ్లీ టాప్ స్పాట్ సాధిస్తాడా?

ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ ప్లేయర్లుగా పిలుచుకునే నలుగురు ఆటగాళ్లు గత రెండేళ్లలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో ఈ నలుగురి స్థానాలు తారుమారయ్యాయి. మూడేళ్లుగా ఫామ్ లేక తంటాలు పడిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ స్థానం కూడా దిగజారింది. సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2021 జనవరిలో చూసుకుంటే.. అసలు సిసలు క్రికెట్ ఫార్మాట్ అయిన టెస్టుల్లో విరాట్ కోహ్లీ 27 సెంచరీలతో నిలిచాడు. అప్పటికి ఫ్యాబ్యులస్ ఫోర్‌గా పిలుచుకునే నలుగురిలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

రెండేళ్ల క్రితం..
మిగతా ముగ్గురిలో ఆసీస్ స్టార్ స్టీవెన్ స్మిత్ 24 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానంలో 24 సెంచరీలతో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలిచాడు. ఇక చివరి స్థానంలో కేవలం 17 సెంచరీలతో జో రూట్ ఉన్నాడు. కానీ ఈ రెండేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. 2021లో చివరి స్థానంలో ఉన్న జో రూట్ ఆ తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్సీ వదులుకొని కేవలం బ్యాటింగ్‌పైనే ఫోకస్ పెట్టాడు. దీంతో అతని ఫామ్ మళ్లీ పీక్స్‌కు చేరింది. వరుస పెట్టి సెంచరీలు బాదేస్తున్నాడు.

అదరగొట్టిన జో రూట్..
ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ కూడా ఇటీవలే మళ్లీ గాడిన పడ్డాడు. దీంతో తను కూడా టెస్టుల్లో సత్తా చాటాడు. చివరకు కివీస్ కెప్టెన్ కేన్ విలియమస్సన్ కూడా ఒక సెంచరీ చేశాడు. కానీ కోహ్లీ మాత్రం ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క టెస్టు శతకం కూడా చెయ్యలేదు. దీంతో అతను 27 సెంచరీలతో మూడో స్థానానికి పడిపోయాడు. ఇప్పుడు ఈ నలుగురిలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా స్టీవ్ స్మిత్ ఉన్నాడు. అతను మొత్తం 30 టెస్టు శతకాలు చేశాడు. అద్భుతంగా పుంజకున్న జో రూట్ 29 సెంచరీలతో రెండో స్థానానికి ఎగబాకాడు.

సెంచరీ చేయని కోహ్లీ..
ఫామ్ లేక ఇబ్బందులు పడుతున్న కోహ్లీ 27 సెంచరీలతోనే ఉండిపోయాడు. ఈ రెండేళ్లలో ఒకే ఒక్క టెస్టు శతకం చేసిన కేన్ విలియమ్సన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఇటీవలే వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లీ ఫామ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇదే ఫామ్‌ను టెస్టుల్లో కొనసాగించేందుకు అతను ప్రయత్నిస్తున్నాడు. ఢిల్లీ టెస్టులో చాలా పట్టుదలగా ఆడాడు. కానీ దురదృష్టవశాత్తూ అవుటయ్యాడు. ఈ క్రమంలో తనకు అచ్చొచ్చిన ఇండోర్ స్టేడియంలో అతను భారీ స్కోరు చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అదే జరిగి కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకుంటే మిగతా వాళ్లందర్నీ అతను వెనక్కు నెట్టేయడం ఖాయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications