For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫోర్ దూరంలో: కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రెండు రికార్డుల్ని సాధించేందుకు చేరువలో ఉన్నాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో శనివారం జరగనున్న రెండో టీ20లో కోహ్లీ ఈ రికార్డులను సాధించే అవకాశం ఉంది.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రెండు రికార్డుల్ని సాధించేందుకు చేరువలో ఉన్నాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో శనివారం జరగనున్న రెండో టీ20లో కోహ్లీ ఈ రికార్డులను సాధించే అవకాశం ఉంది. అంతర్జాతీయ టీ20లో 200 ఫోర్లను సాధించడానికి కోహ్లీ ఒక్క ఫోర్ దూరంలో ఉన్నాడు.

మూడో క్రికెటర్‌గా అరుదైన ఘనత

మూడో క్రికెటర్‌గా అరుదైన ఘనత

రెండో టీ20లో విరాట్ కోహ్లీ ఫోర్ కొడితే 200 ఫోర్లు సాధించిన సాధించిన మూడో క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. ఇప్పటివరకు టీ20ల్లో కేవలం ఇద్దరు మాత్రమే 200 ఫోర్లు రికార్డుని అందుకున్నారు. అందులో ఒకరు శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్(223) కాగా, మరొకరు అఫ్ఘనిస్థాన్‌కు చెందిన మొహ్మద్ షహజాద్(200).

ఢిల్లీ టీ20లో ఒక్క ఫోర్ కొట్టలేదు

ఢిల్లీ టీ20లో ఒక్క ఫోర్ కొట్టలేదు

నిజానికి ఢిల్లీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 200 ఫోర్లు మార్కును విరాట్ కోహ్లీ చేరతాడని భావించినా అది జరగలేదు. తొలి టీ20లో 11 బంతులను ఎదుర్కొని కేవలం మూడు సిక్సుల సాయంతో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క ఫోర్ కూడా కొట్టక పోవడం విశేషం.

ఆసీస్ సిరిస్‌లోనే 199 బౌండరీలు

ఆసీస్ సిరిస్‌లోనే 199 బౌండరీలు

న్యూజిలాండ్ పర్యటనకు ముందు ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ నాటికే కోహ్లీ 199 బౌండరీలు సాధించాడు. ఆసీస్-భారత్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జరగాల్సిన మూడో టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో 200 ఫోర్ల మార్కును చేరుకునేందుకు కోహ్లీకి ఆలస్యమైంది.

11 పరుగుల దూరంలో

11 పరుగుల దూరంలో

ఇక రెండో రికార్డు విషయానికి వస్తే... అంతర్జాతీయ టీ20ల్లో రెండో అత్యధిక పరుగుల్ని సాధించడానికి కోహ్లీ 11 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ టీ 20ల్లో 1878 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీకి ముందు శ్రీలంక క్రికెటర్ దిల్షాన్(1889) ఉండగా, తొలి స్థానంలో బ్రెండన్ మెకల్లమ్(2140) ఉన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+