Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన గౌరవం: సీఏ వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఐసీసీ ప్రకటించిన వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన కోహ్లీ తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) ప్రకటించిన వన్డే జట్టుకు కూడా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

నిజానికి ఈ అవార్డు ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను వరిస్తుందని అందరూ భావించారు. అయితే అతడిని పక్కనపెట్టి కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక క్రికెట్ ఆస్ట్రేలియా చేయడం విశేషం. ఈ వన్డే జట్టులో కోహ్లీతో పాటు భారత జట్టు నుంచి యార్కర్ స్పెషలిస్టు జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా ఎంపికయ్యాడు.

''2016లో భారత జట్టు కెప్టెన్‌ కేవలం 10 వన్డేలు మాత్రమే ఆడాడు. కానీ 50 ఓవర్ల ఫార్మాట్లో తానో అత్యుత్తమ క్రికెటర్‌ అని నిరూపించుకున్నాడు'' అని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. 2016లో కోహ్లి ఆడిన 10 ఇన్నింగ్స్‌లో ఎనిమిదింటిలో 45 అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేశాడు.

Virat Kohli named ODI skipper of Cricket Australia's Team of the year; Bumrah also in the list

ఇక నిలకడైన బౌలింగ్‌ కారణంగానే బుమ్రాను ఎంపిక చేసినట్టు సీఏ ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలి ఏడాదే అద్భుతంగా రాణించాడని ప్రశంసించింది. జనవరిలో ఆస్ట్రేలియాపై కోహ్లీ వరుస సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా లక్ష్యాన్ని చేధించిన 59 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి సగటు 90.10గా ఉంది.

ఇక్కడ విశేషం ఏమిటంటే భారత విజయానికి అవసరమైన పరుగులను కోహ్లీ చేయడమే. ఇక మూడు రోజుల క్రితం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన టెస్టు జట్టుకు కూడా కోహ్లీనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఆల్‌ స్టార్స్‌ జట్టులో స్టీవ్ స్మిత్‌కు స్థానం దక్కింది.

క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన వన్డే జట్టు:
* విరాట్‌ కోహ్లీ (భారత్- కెప్టెన్‌)
* స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా)
* డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)
* మిచెల్‌ మార్ష్‌ (ఆస్ట్రేలియా)
* జాన్ హేస్టింగ్స్‌ (ఆస్ట్రేలియా)
* మిచెల్ స్టార్క్‌ (ఆస్ట్రేలియా)
* క్వింటన్‌ డి కాక్‌ (దక్షిణాఫ్రికా)
* జోస్ బట్లర్‌ (ఇంగ్లాండ్‌)
* ఇమ్రాన్‌ తాహిర్‌ (దక్షిణాఫ్రికా)
* జస్‌ప్రీత్‌ బుమ్రా (భారత్‌)
* బాబర్‌ ఆజమ్‌ (పాకిస్థాన్‌)

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+