For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ అవార్డులు: అరుదైన ఘనత... ధోని, పాంటింగ్‌ల సరసన కోహ్లీ

By Nageshwara Rao
Virat Kohli Named ICC Cricketer of the Year 2017; Also Bags ODI Cricketer Award

హైదరాబాద్: గతేడాది అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 2017 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌ అవార్డుని సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్ గ్యార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీతో పాటు వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుకి కూడా ఎంపికయ్యాడు.

ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకోవడం విరాట్ కోహ్లీ ఇది రెండోసారి. అంతేకాదు ఐసీసీ ప్రకటించిన అంతర్జాతీయ వన్డే టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌, టెస్టు టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ జట్లకు కూడా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీనే ఎంచుకుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

2009లో ధోనీ మాత్రమే ఈ రెండు అవార్డులను సొంతం చేసుకున్నాడు. మొత్తంగా ముగ్గురు కెప్టెన్లు మాత్రమే ఒకే ఏడాదిలో టెస్టు, వన్డే కెప్టెన్‌గా ఎంపికయ్యారు. 2004, 2007 ఏడాదిల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఘనత సాధించగా.... ఆ తర్వాత ధోనీ, కోహ్లీలు మాత్రమే ఈ ఘనత సాధించారు.

అంతేకాదు 2017 సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కూడా అందుకోనున్నాడు. ఈ అవార్డుకు ఎంపికైన నాలుగో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు. 2004లో రాహుల్ ద్రవిడ్, 2010లో సచిన్ టెండూల్కర్, 2016లో రవిచంద్రన్ అశ్విన్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 18, 2018, 15:01 [IST]
Other articles published on Jan 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+