న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెక్‌గ్రాత్‌ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా కోహ్లీ ఎంపిక

ఆస్ట్రేలియా లెజెండరీ బౌలర్ గ్లెన్‌ మెక్‌గ్రాత్ 2016 సంవత్సరానికి గాను తాను ప్రకటించిన టెస్టు జట్టుకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఆస్ట్రేలియా లెజెండరీ బౌలర్ గ్లెన్‌ మెక్‌గ్రాత్ 2016 సంవత్సరానికి గాను తాను ప్రకటించిన టెస్టు జట్టుకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును గెలుచుకున్న రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా ఈ జట్టులో చోటు లభించింది.

క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మెక్‌గ్రాత్ 12 మంది ఆటగాళ్లతో కూడిన టెస్టు జట్టుని ప్రకటించాడు. ఈ జట్టులో ముగ్గురు ఆసీస్‌ ఆటగాళ్లకు, నలుగురు ఇంగ్లండ్‌ క్రికెటర్లకు చోటు దక్కింది. కేవలం గణాంకాల ఆధారంగానే జట్టుని ఎంపిక చేయలేదని మెక్‌గ్రాత్ చెప్పాడు.

ఆటగాళ్ల గణాంకాలతోపాటు ఆటగాళ్ల దృక్పథం, మ్యాచ్‌పై వారి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నానని వివరించాడు. కాగా, ఆస్ట్రేలియా నుంచి స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ స్టార్క్‌లు ఎంపిక కాగా, ఇంగ్లాండ్‌ నుంచి జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, బెయిర్‌స్టోలకు చోటు లభించింది.

Virat Kohli named captain of Glenn McGrath's Test Team of 2016; R Ashwin also in the squad

వీరితో పాటు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, పాకిస్థాన్‌ స్పిన్నర్‌ యాషిర్‌ షా, దక్షిణాఫ్రికా యువ పేసర్‌ రబాడలకు చోటు దక్కింది. ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన టెస్టు జట్టులో కూడా కోహ్లీ, అశ్విన్‌లు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ఈ ఏడాది వన్డే జట్టుకు కెప్టెన్‌గా కోహ్లీని ఎంచుకున్న సంగతి తెలిసిందే. మూడు ఫార్మెట్లలో కూడా ఈ ఏడాది కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చిన సంగతి తెలిసిందే.

మెక్‌గ్రాత్ టెస్టు జట్టు ఇదే:

1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
2. జో రూట్ (ఇంగ్లాండ్)
3. విరాట్ కోహ్లీ (కెప్టెన్) (ఇండియా)
4. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
5. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)
6. జానీ బెయిర్ స్టో (వికెట్ కీపర్) (ఇంగ్లాండ్)
7. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)
8. రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా)
9. మిటెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
10. కైగో రబాడ (దక్షిణాఫ్రికా)
11. యాసిర్ షా (పాకిస్థాన్)
12. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్)

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X