న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించండి: సోషల్ మీడియాలో ట్వీట్స్

IPL 2019 : 'Virat Kohli Must Step Down,Rohit Should Lead India In World Cup' Twitter Reacts
Virat Kohli must step down, Rohit Sharma should lead India in World Cup: Twitter users react to IPL 2019 results

హైదరాబాద్: ఐపీఎల్ 2019 ఆర్సీబీకి ఎంతమాత్రం కలిసి రాలేదు. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. వరుసగా ఆరు ఓటములతో ప్లే ఆఫ్ ఆశలను సైతం సంక్లిష్టం చేసుకుంది. ఆర్సీబీ వరుస ఓటములు విరాట్ కోహ్లీ నాయకత్వంపై ప్రభావం చూపేలా ఉన్నాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కోహ్లీ కెప్టెన్సీపై గంభీర్ విమర్శలు

కోహ్లీ కెప్టెన్సీపై గంభీర్ విమర్శలు

ఇప్పటికే గౌతమ్ గంభీర్‌తో పాటు చాలా మంది మాజీ క్రికెటర్లు కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు చేస్తున్నారు. కోహ్లీ మంచి బ్యాట్స్‌మనే అయి ఉండొచ్చు గాక మంచి కెప్టెన్ మాత్రం కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రభావం వరల్డ్‌కప్ మీద పడకుండా ఉండాలంటే కోహ్లీ భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకోవాలని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

రోహిత్‌శర్మను కెప్టెన్‌గా ప్రమోట్ చేయాలి

రోహిత్‌శర్మను కెప్టెన్‌గా ప్రమోట్ చేయాలి

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని వైస్ కెప్టెన్‌ రోహిత్‌శర్మకు వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌గా అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రోహిత్‌ శర్మ నాయకత్వంలో ముంబై జట్టు మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవగా... ఒకసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచింది.

కోహ్లీకి విశ్రాంతి కల్పించాలి

దీంతో పాటు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా రోహిత్‌ శర్మకు ఉందని అంటున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌ తన ట్విటర్‌‌లో "భారత్‌ తెలివైన జట్టయితే వరల్డ్‌కప్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించాలి" అంటూ ట్వీట్ చేశాడు.

కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తేనే

కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తేనే

మరొక అభిమాని అయితే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తేనే బెంగళూరు జట్టు విజయాన్ని సాధిస్తుందని ట్వీట్ చేశాడు. కోహ్లీ కెప్టెన్సీ తొలగింపు విషయంలో మరికొందరు అభిమానులు అతడికి మద్దతుగా నిలవడం విశేషం. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Story first published: Monday, April 8, 2019, 15:54 [IST]
Other articles published on Apr 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X