Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, ధోనీ లేకుండానే లంకకు భారత్: యువ క్రికెటర్లకి అవకాశం

Virat Kohli and MS Dhoni rested for Nidahas Trophy

హైదరాబాద్: ధోనీ సలహాలతో కోహ్లీ జట్టును గెలిపిస్తాడు. కోహ్లీ మాట విని జట్టు ముందుకుసాగుతోంది. కొద్ది నెలలుగా భారత జట్టులో జరుగుతోన్న తంతు ఇది. అలాంటిది ఏకంగా ఇద్దరూ లేకుండా భారత జట్టు ముక్కోణపు సిరీస్‌కు సిద్ధమైంది.

స్వదేశీ గడ్డపై అద్వితీయంగా రాణించిన రోహిత్ శర్మ సఫారీ పర్యటనలో ఒక్క వన్డే మినహాయించి ఏ మ్యాచ్ లోనూ 30కు మించిన పరుగులు చేయలేదు. అలాంటిది ముక్కోణపు సిరీస్‌కు కెప్టెన్‌గా కొనసాగనున్న రోహిత్ శర్మ జట్టును ఎలా నడిపిస్తాడో అనేది సగటు క్రికెట్ అభిమాని ప్రశ్న.

శ్రీలంక, బంగ్లాదేశ్‌తో మార్చి 6 నుంచి జరిగే ముక్కోణపు టీ20 సిరీస్‌కు భారత జట్టు సభ్యలు జాబితా ఖరారైంది. చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో సమావేశమైన చీఫ్‌ సెలక్షన్‌ కమిటీ ఈ మేరకు జట్టును ప్రకటించింది. రోహిత్‌శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టు ముక్కోణపు సిరీస్‌లో ఆడనుంది. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లికి, మహేంద్ర సింగ్ ధోనీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వీరితో పాటుగా భువనేశ్వర్, బుమ్రా, పాండ్యాలు సిరీస్‌కు అందుబాటులో ఉండరు.

జట్టు వివరాలు..

రోహిత్‌శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, యజువేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, విజయ్‌ శంకర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌, మహమ్మద్‌ సిరాజ్‌, రిషబ్‌ పంత్‌.

Story first published: Monday, February 26, 2018, 10:37 [IST]
Other articles published on Feb 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+