ఉప్పల్‌లో అరుదైన ఘటన: ఎడమ చేత్తో బ్యాటింగ్ చేసిన కోహ్లీ, ధోని
హైదరాబాద్: సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన మూడో టీ20 వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంఫైర్లు మ్యాచ్‌ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో మూడు టీ20ల సిరిస్ 1-1తో సమమైంది. చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగడంతో అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. అయితే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్లక్ష్యం వల్ల మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.
అయితే, మూడో టీ20లో క్రికెట్ అభిమానులను ఊరడించే విషయం ఏంటంటే భారత క్రికెటర్లు మైదానంలో కాసేపు ప్రాక్టీస్ చేయడం. అంఫైర్లు మ్యాచ్‌ని రద్దు చేయడానికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, హర్దిక్ పాండ్యా కలిసి మైదానంలో సరదాగా ప్రాక్టీస్ చేశారు.
అయితే ఇక్కడ మన క్రికెటర్లు ప్రాక్టీస్ చేసింది ఎడమ చేతి వాటంతో. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో భారత క్రికెటర్లు సరదాగా ఎడమ చేతి బ్యాటింగ్ చేసిన కాసేపు అభిమానులను అలరించారు. ముందు మైదానంలోకి దిగిన రోహిత్ శర్మ కాస్త తడబడినప్పటికీ.. తర్వాత వచ్చిన కోహ్లీ మాత్రం భలేగా ఆడాడు.
ఇక యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా బాగానే ఆడాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనదైన శైలిలో షాట్లు ఆడాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విరాట్ కోహ్లీ
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మూడో టీ20కి ముందు ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

మహేంద్ర సింగ్ ధోని
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మూడో టీ20కి ముందు ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ధోని చక్కటి షాట్లతో అభిమానులను అలరించాడు.

రోహిత్ శర్మ
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మూడో టీ20కి ముందు ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.

హార్ధిక్ పాండ్యా
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మూడో టీ20కి ముందు ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తున్న యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications