Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాప్-5లో కోహ్లీ, మూడో స్ధానానికి పడిపోయిన రవీంద్ర జడేజా

Virat Kohli moves up to 5th in ICC Test rankings; Ravindra Jadeja drops to third place

హైదరాబాద్: ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్-5లో చేరాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో తొలి టెస్టు అనంతరం మంగళవారం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు.

ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈడెన్‌లో తొలి సెంచరీ కావడంతో పాటు కోహ్లీ కెరీర్‌లో 50 సెంచరీ కావడం విశేషం. ఫలితంగా 807 రేటింగ్ పాయింట్లతో కోహ్లి ఐదో స్థానానికి ఎగబాకాడు.

ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను వెనక్కునెట్టాడు. ప్రస్తుతం కోహ్లీ ఐదో స్థానంలో కొనసాగుతుండగా, వార్నర్ ఆరో స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రెండు స్థానాలు ఎగబాకి 28వ స్ధానంలో కొనసాగుతున్నాడు.

ఇక్కడ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 936 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ (889) రెండో స్థానంలో, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(880) మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కోహ్లీ తర్వాత భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా (866)తో నాలుగో స్ధానంలో నిలవగా, కేఎల్ రాహుల్ 8వ స్ధానంలో నిలిచాడు.

ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ఒక స్థానం దిగజారి మూడో స్థానంలో నిలవగా, అశ్విన్ నాలుగో స్ధానంలో నిలిచాడు. శ్రీలంకపై తొలి టెస్టులో విజృంభించిన భారత పేసర్‌ భువనేశ్వర్‌ 8 ర్యాంకులు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమంగా 28వ స్థానంలో నిలవగా... మరో బౌలర్‌ షమీ ఒక స్థానం మెరుగై 18వ ర్యాంకులో ఉన్నాడు.

Story first published: Tuesday, November 21, 2017, 18:13 [IST]
Other articles published on Nov 21, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+