
విమర్శలకు చెక్..
విరాట్ కోహ్లీ సత్తాకు నిలువుటద్దంలా మారిందీ ఇన్నింగ్. ప్రతి ఒక్కరు కూడా అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్‌ను ఆశించారు. కొన్ని నెలలుగా ఫామ్‌ను కోల్పోయి తీవ్ర విమర్శలకు గురైన కోహ్లీపై ఒక దశలో వేటు పడుతుందనే అంచనాలు సైతం వ్యక్తం అయ్యాయి. అతని పనైపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆసియా కప్‌తో కోహ్లీ ఆటతీరు మళ్లీ ట్రాక్‌లో పడింది. ఈ టోర్నమెంట్ తరువాత ఆడిన టీ20 ఇంటర్నేషనల్స్‌లో చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు.

పాకిస్తాన్‌పై టాప్ స్కోరర్..
అదే ఊపుతో పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డాడు కోహ్లీ. మెల్‌బోర్న్‌లో ఆడిన ఈ ఒక్క ఇన్నింగ్‌తో ఎన్నో విమర్శలకు చెక్ చెప్పాడు.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టేశాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు రికార్డులు మటాష్ అయ్యాయి. టీ20 ఇంటర్నేషనల్స్‌లో విరాట్ కోహ్లీని కొట్టే మొనగాడు సమీప భవిష్యత్తులో ఉండడు. అటు పాకిస్తాన్ బౌలర్లపైనా సునామీలా విరుచుకుపడే భారత క్రికెటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు.

టీ20ల్లో టాప్ స్కోరర్..
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లల్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక్కడే. టీ20 ఇంటర్నేషనల్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను రోహిత్ శర్మను దాటేశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ముందు వరకు రోహిత్ శర్మే టాప్ స్కోరర్. ఇది చెరిగిపోయింది. 2010-2022 మధ్య జరిగిన టీ20 ఇంటర్నేషనల్స్‌లో విరాట్ కోహ్లీ 3,773 పరుగులు చేశాడు. ఇదే గ్యాప్‌లో రోహిత్ శర్మ-3,741, మార్టిన్ గప్టిల్-3,531, బాబర్ ఆజమ్- 3,231, పాల్ స్టిర్లింగ్-3,119 పరుగులు చేశారు.

ఛేజింగ్‌లో 18 సార్లు నాటౌట్‌గా..
ఓ టీ20లో ఎక్కువసార్లు 50కి పైగా పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీదే. 35 సార్లు అతను టీ20 ఇంటర్నేషనల్స్‌లో 50కి పైగా పరుగులు సాధించాడు. టీ20ల్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18 సార్లు నాటౌట్‌గా ఉన్నాడు కోహ్లీ. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం కంటే దాన్ని ఛేదించడానికి విరాట్ కోహ్లీ ఎక్కువగా ఇష్టపడతాడనేది ఈ ఇన్నింగ్‌తో మరోసారి స్పష్టమైంది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 18సార్లు నాటౌట్‌గా నిలిచాడు కోహ్లీ.

ఐసీసీ ర్యాంకింగ్స్
పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్- అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ర్యాంకింగ్స్‌లోనూ అతణ్ని ఎగబాకేలా చేసింది. ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు కోహ్లీ ర్యాంక్- 35. ఈ టోర్నమెంట్ ముగిసేసరికి 15కు వచ్చి చేరాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ముగిసే సరికి ఒకే ఒక్క లాంగ్ జంప్ చేశాడు. టాప్ 10లోకి వచ్చి చేరాడు. ఐసీసీ లేటెస్ట్‌గా ప్రకటించిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అతని స్థానం.. 9. రెండే రెండు నెలల వ్యవధిలో ఈ స్థాయిలో తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్న ప్లేయర్ మరొకరు లేడు.

అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్స్ కూడా కోహ్లీ ఖాతాలోనే..
అవేకాకుండా- ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఇలాంటి ఈవెంట్లల్లో పాకిస్తాన్‌పై అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకుంది కూడా విరాట్ కోహ్లీనే. అలాగే- ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్‌ను అందుకున్న వారిలో రెండోస్థానంలో నిలిచాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ ఫిగర్ కూడా కోహ్లీ పేరు మీదే ఉంది.


Click it and Unblock the Notifications
