మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్ కోహ్లీ.. టాప్-10లో ఆరుగురు భారత క్రికెటర్లే!!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా.. బరిలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఛేదనలో తిరుగులేని బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టాడు. భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసి రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఇది మరోసారి రుజువైంది. విరాట్ కోహ్లీ ప్ర‌పంచంలో అత్యంత పాపుల‌ర్ క్రికెట‌ర్ అని ఓ అధ్య‌యనం తేల్చింది.

'రిటైర్‌మెంట్ ఆలోచనే లేదు.. ఇంకొన్నాళ్లు కొనసాగుతా'

మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్ కోహ్లీ:

మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్ కోహ్లీ:

31 ఏళ్ల విరాట్ కోహ్లీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్ అని తాజాగా ఓ అధ్య‌యనం వెల్లడించింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి-జూన్ మ‌ధ్య ఆన్‌లైన్‌లో కోహ్లీ కోసం నెల‌కు స‌గ‌టున దాదాపు 16.2 ల‌క్ష‌ల సార్లు వెతికిన‌ట్లు ఎస్ఈఎస్ ర‌ష్ అనే సంస్థ సోమ‌వారం వెల్ల‌డించింది. నెలకు సగటున 2.4 లక్షల సార్లు శోధించారు. టీమిండియా తరఫున దశాబ్దకాలంగా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ వన్డేల్లో 43, టెస్టుల్లో 26 శతకాలు సాధించి.. సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డ్‌ని బద్దలు కొట్టగల సామర్థ్యం ఉన్న ఏకైక ఆటగాడిగా కనిపిస్తున్నాడు. గత నాలుగేళ్లలో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ తరహాలో ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఆధిపత్యం చెలాయించలేకపోయాడంటే అతిశయోక్తి కాదేమో.

ఆరుగురు భారత క్రికెటర్లు:

ఆరుగురు భారత క్రికెటర్లు:

ఎస్ఈఎస్ ర‌ష్ అధ్యయనం ప్రకారం టాప్-10లో ఆరుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. రోహిత్ శ‌ర్మ (9.7 ల‌క్ష‌లు), ఎంఎస్ ధోనీ (9.4 ల‌క్ష‌లు), జార్జ్ మెకే (9.1 ల‌క్ష‌లు), జోష్ రిచ‌ర్డ్స్ (7.1 ల‌క్ష‌లు), హార్దిక్ పాండ్యా (6.7 ల‌క్ష‌లు), స‌చిన్ టెండూల్క‌ర్ (5.4 ల‌క్ష‌లు), క్రిస్ మాథ్యూస్ (4.1 ల‌క్ష‌లు), శ్రేయ‌స్ అయ్య‌ర్ (3.4 ల‌క్ష‌లు)లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మహిళా క్రికెటర్లను కూడా వెతికారు. వారు టాప్-10 లో లేనప్పటికీ స్మృతి మంధన, ఎల్లిస్ పెర్రీలు వరుసగా 12, 20వ స్థానంలో ఉన్నారు. యువరాజ్ సింగ్ మరియు శిఖర్ ధావన్ వంటి పెద్ద స్టార్ల పేర్లు కూడా ఉన్నాయి..

టీమిండియా@1:

టీమిండియా@1:

భార‌త క్రికెట్ జ‌ట్టు గురించి నెల‌కు 2.4 ల‌క్ష‌ల మంది వెతికిన‌ట్లు ఈ అధ్య‌యనంలో తేలింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ 0.66 ల‌క్ష‌ల‌తో రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (0.33), వెస్టిండీస్ (0.29), పాకిస్తాన్ (0.23), దక్షిణాఫ్రికా (0.16), బంగ్లాదేశ్ (0.12), న్యూజిలాండ్ (0.12), శ్రీలంక (0.09), ఐర్లాండ్ (0.05), ఆఫ్ఘనిస్తాన్ (0.04) మరియు జింబాబ్వే (0.03)లు వరుసగా కొనసాగుతున్నాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, August 10, 2020, 20:59 [IST]
Other articles published on Aug 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X