న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా గడ్డానికి ఎలాంటి ఇన్సూరెన్స్ చేయించలేదు: కోహ్లీ

Virat Kohli mocks media after reports of his beard insurance

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తన గడ్డానికి బీమా చేయించుకున్నాడంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా దీనిపై కోహ్లీ అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. తాను గడ్డానికి బీమా చేయించుకోలేదని.. అదంతా ఓ యాడ్‌లో భాగమని తెలిపాడు. శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఇందులో కోహ్లీకి తన గడ్డానికి బీమా చేయించుకున్నాంటూ వస్తున్న వార్తలపై ప్రశ్నలు ఎదురయ్యాయి.

గడ్డానికి బీమా చాలా మందికి ఎన్నో సందేహాలు:

గడ్డానికి బీమా చాలా మందికి ఎన్నో సందేహాలు:

‘గత కొద్ది రోజులుగా చాలా మంది నా గడ్డం గురించి మాట్లాడుకుంటున్నారు. గడ్డానికి బీమా చేయించుకున్నానంటూ వస్తోన్న వార్తలపై చాలా మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే, నా గడ్డానికి ఎలాంటి బీమా చేయించుకోలేదు. ఇదంతా ఓ యాడ్‌లో భాగం మాత్రమే' అని కోహ్లీ బదులిచ్చాడు. తాజాగా కోహ్లీ ఫిలిప్స్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటూ:

బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటూ:

ఐపీఎల్‌లో మెడకు అయిన గాయంతో బాధపడుతోన్న కోహ్లీ బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. శుక్రవారం కోహ్లీ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్‌ పరీక్ష ఎదుర్కోనున్నాడు. ఈ నెల చివరి వారంలో కోహ్లీ టీమిండియాతో కలిసి ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు.

ఇన్సూరెన్స్ చేయించుకున్నాడని ఆ ట్వీట్‌లో

ఇన్సూరెన్స్ చేయించుకున్నాడని ఆ ట్వీట్‌లో

కొద్దిరోజుల ముందే, కోహ్లీ గడ్డంపై క్రికెటర్ కేఎల్ రాహుల్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. కోహ్లీ తన గడ్డానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో పాటు షేర్ చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. వీడియోలో ఇద్దరు వ్యక్తులు కోహ్లీ గడ్డం కొలతలను తీసుకొని, అతడితో సంతకం చేయించుకున్నారు. అది చూస్తే.. గడ్డానికి బీమా చేయించినట్టుగానే అనిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. ‘హ..హ్హ! నీ గడ్డం నీకు చికాకు కలిగిస్తోందని తెలుసు. కానీ, నీ గడ్డానికి ఇన్సూరెన్స్ చేయించుకున్న మాట మాత్రం నిజమేగా..' అంటూ రాహుల్ కామెంట్ పెట్టాడు.

ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారి

కోహ్లీని ఆటపట్టించడానికి రాహుల్ సరదాగా ట్వీట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అభిమానులు ఎవరికి తోచినవిధంగా వారు కామెంట్లు పెడుతున్నారు. ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఇటీవల కోహ్లీ మైనపు బొమ్మను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బహుశా.. తాజా వీడియోలో కనిపిస్తున్నవి మ్యూజియం సిబ్బంది విరాట్ కోహ్లీ నుంచి ఆ విగ్రహం తయారీకి సంబంధించిన కొలతలు తీసుకుంటున్నపటి దృశ్యాలే కావచ్చు!

Story first published: Monday, June 11, 2018, 13:35 [IST]
Other articles published on Jun 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X