Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు బిగ్ షాక్‌.. వ‌న్డే సిరీస్ నుంచి కోహ్లీ ఔట్?

Virat Kohli misses ODI series against South Africa
Virat Kohli To Miss IND VS SA ODI Series కారణాలు ఎన్నో... | Oneindia Telugu

ద‌క్షిణాప్రికా గ‌డ్డ‌పై టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. గాయాలతో ఇప్ప‌టికే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తోపాటు ఆల్‌రౌండ‌ర్లు రవీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్ సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. దీనికితోడు రెండో టెస్టుకు కొన్ని నిముషాల ముందు వెన్ను నొప్పి గాయంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. దీంతో అభిమానులు అంతా షాక్‌కు గురికాక త‌ప్ప‌లేదు. అయితే కేప్‌టౌన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మూడో టెస్టు మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడ‌ని, తాత్కాలిక కెప్టెన్ లోకేష్ రాహుల్ తెలిపాడు. అయితే ప్ర‌స్తుతం అభిమానుల‌ను క‌ల‌వ‌రప‌రిచే మ‌రో వార్త బ‌య‌టికి వ‌చ్చింది.

వ‌న్డే సిరీస్‌కు కోహ్లీ దూరం

వ‌న్డే సిరీస్‌కు కోహ్లీ దూరం

స‌ఫారీల‌తో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వ‌న్డేల సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడ‌ని స‌మాచారం. ఈ మేర‌కు అత‌డు బీసీసీఐని ప‌ర్మిష‌న్ కూడా కోరిన‌ట్లు తెలుస్తోంది. వ‌న్డే సిరీస్ నుంచి త‌ప్పుకుని కుటుంబంతో గ‌డపాలని కోహ్లీ భావిస్తున్నాడ‌ట‌. దీనికి తోడు గాయం కూడా కావ‌డంతో వ‌న్డే సిరీస్ త‌ప్పుకోని విశ్రాంతి తీసుకోవాల‌ని కోహ్లీ అనుకుంటున్నాడ‌ట‌. అందుకే వ‌న్డే సిరీస్ నుంచి త‌ప్పుకోవ‌డానికి బీసీసీఐని అనుమ‌తి కోరాడ‌ని తెలుస్తోంది. అయితే కోహ్లీకి గాయం కూడా కావ‌డంతో అత‌ని ప్ర‌త‌పాద‌న‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స‌మాచారం. అంతేకాకుండా గాయం నుంచి పూర్తిగా కోలుకోక‌పోతే విరాట్ కోహ్లీ కేప్‌టౌన్ వేదిక‌గా జ‌రిగే మూడో టెస్టు మ్యాచ్‌కు కూడా దూర‌మ‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

ప‌ర్య‌ట‌న‌కు ముందే వార్త‌లు

ప‌ర్య‌ట‌న‌కు ముందే వార్త‌లు

సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డానికి ముందే కోహ్లీ వ‌న్డే సిరీస్ నుంచి త‌ప్పుకుంటున్నాడ‌నే వార్తలు వ‌చ్చాయి. కానీ కోహ్లీనే ఆ వార్త‌లు కొట్టిపాడేయ‌డంతో అనుమానాలు తొల‌గిపోయాయి. కాగా సౌతాఫ్రికాతో ఈ నెల 19, 21, 23న మూడు వ‌న్డే మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకోసం బీసీసీఐ ఇప్ప‌టికే 18 మందితో కూడిన జ‌ట్టును కూడా ప్ర‌క‌టించింది. రాహుల్‌ను కెప్టెన్‌గా, బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియ‌మించింది.

భార‌త జ‌ట్టు:

భార‌త జ‌ట్టు:

కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), బుమ్రా(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), చహల్‌, ఆర్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్ధూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌.

ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఆగాల్సిందే

ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఆగాల్సిందే

జోహ‌న్నెస్‌బ‌ర్గ్ టెస్టుకు దూరం కావ‌డంతో కేప్‌టౌన్ టెస్ట్ ద్వారా కెరీర్‌లో 100 టెస్టు మ్యాచ్‌ల మైలురాయిని అందుకునే అవ‌కాశాన్ని కోహ్లీ కోల్పోయాడు. ఇప్ప‌టివ‌ర‌కు కోహ్లీ 98 టెస్టు మ్యాచ్‌లు ఆడ‌గా.. కేప్‌టౌన్‌ది 99వ‌ది అవుతుంది. దీంతో కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్ కోసం ఫిబ్ర‌వరి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

కోహ్లీ వ‌న్డే రికార్డులు

కోహ్లీ వ‌న్డే రికార్డులు

వ‌న్డే క్రికెట్‌లోని అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో కోహ్లీ ఒక‌డు. కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 254 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఏకంగ 59 స‌గ‌టుతో 12,169 ప‌రుగులు చేశాడు. ఇందులో 43 సెంచ‌రీలు, 62 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన జాబితాలో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ చివ‌ర‌గా 2021లో మార్చి 28న ఇంగ్లండ్‌తో వ‌న్డే మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 7 ప‌రుగులే చేశాడు.

Story first published: Tuesday, January 4, 2022, 9:39 [IST]
Other articles published on Jan 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+