సర్రే డీల్ ప్రకారం ఐర్లాండ్‌తో తొలి టీ20కి కెప్టెన్‌గా కోహ్లీ అనుమానమే!

హైదారాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్‌పై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆప్ఘనిస్థాన్‌తో జరిగే చారిత్రాత్మక టెస్టు దూరం కావడంతో ఇప్పటికే పలువురు విరాట్ కోహ్లీని విమర్శిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో సత్తాచాటడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ ఈ విమర్శలను పట్టించుకోకుండా కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు.

రెండు టీ20లకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ
ఈ క్రమంలో ఐర్లాండ్‌తో జూన్ 27, 29 తేదీల్లో జరగనున్న రెండు టీ20ల కోసం సెలక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ రెండు టీ20లకు కోహ్లీనే కెప్టెన్‌గా నియమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తొలి టీ20లో కోహ్లీ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆ సమయంలో కోహ్లీ సర్రే జట్టు తరపున కౌంటీ క్రికెట్ ఆడనుండడమే.

సర్రె జట్టుతో కోహ్లీ చేసుకున్న ఒప్పందం
జూన్ 28తోగానీ సర్రె జట్టుతో కోహ్లీ చేసుకున్న ఒప్పందం పూర్తి కాదు. కోహ్లీ జూన్ 25న చివరి కౌంటీ మ్యాచ్ ఆడనున్నాడు. అంటే జూన్ 27న ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20కి కోహ్లి అందుబాటులో ఉండడు. సర్రె జట్టు తరఫున కోహ్లీ మూడు వన్డేలు, మూడు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడటానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

బీసీసీఐ నుంచి లేని అధికారిక ప్రకటన
సర్రె జట్టు డైరెక్టర్ అలెక్ స్టివార్ట్ కూడా జూన్ మొత్తం కోహ్లి తమ టీమ్‌తోనే ఉంటాడని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయంలో బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సర్రే జట్టు మాత్రం ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20కి కోహ్లీ అందుబాటులో ఉండడని స్పష్టం చేసింది.

బీసీసీఐకి ఈమెయిల్ ద్వారా తెలియచేసిన సర్రే జట్టు
ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేసింది. ఆ సమయంలో కోహ్లీ యార్క్‌షైర్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడని, కాబట్టి తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని, కానీ రెండో టీ20 నాటికి అతడు అందుబాటులోకి వస్తాడని సర్రే మీడియా విభాగం ఈ-మెయిల్ ద్వారా భారత్‌కు తెలియజేసింది. దీంతో కోహ్లీ తొలి మ్యాచ్‌లో ఆడే అవకాశం లేకపోవడంతో ఆ మ్యాచ్‌కు కెప్టెన్‌గా ఎవరిని నియమిస్తారన్నది సస్పెన్స్‌గా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications