ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా రంగంలోకి విరాట్ కోహ్లీ!
న్యూఢిల్లీ: భారత యూత్ ఐకాన్‌గా మారిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో మంచి కార్యానికి పూనుకోనున్నాడు. ఇప్పటికే పలు అనాథాశ్రమాలకు తనవంతుగా ఆర్థిక సాయాన్ని అందిస్తున్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు విద్యార్థి లోకాన్ని భయాందోళనకు గురిచేస్తున్న ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా గళం విప్పనున్నాడు.
కాగా, అతడితో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ ఆర్డీ) శాఖ భావిస్తోంది. దీని గురించి ప్రభుత్వాధికారులు అతడ్ని సంప్రదిస్తే కోహ్లీ ఒప్పుకుంటాడా? లేదా అనేది వేచి చూడాలి.
కాగా, నిరుడు 399 ర్యాగింగ్ కేసులు నమోదయ్యాయి. ర్యాగింగ్ కారణంగా కొందరు విద్యార్థులు విద్యకు దూరమవుతుండగా, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాలయాల్లో ర్యాగింగ్ నివారణకు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కోహ్లీ లాంటి జనాకర్షణ కలిగిన సెలబ్రిటీతో ప్రచారం చేయిస్తే సందేశంలో వెంటనే సదరు వర్గాలకు చేరుతుందని సర్కారు యోచిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ర్యాగింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ర్యాగింగ్ వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి వివరిస్తూ పోస్టర్లు, ప్రకటనలు, లఘుచిత్రాలు రూపొందించాలని యూజీసీని ప్రభుత్వం ఆదేశించింది. ఉచిత మొబైల్ యాప్ కూడా తీసుకురానుంది. ర్యాగింగ్ పై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800-180-5522 ను అందుబాటులోకి తెచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications