కోహ్లీ ముంగిట మరో ఘనత: గంగూలీ రికార్డుని బద్దలు కొడతాడా?
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో వ్యక్తిగత రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా, శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ మరో రికార్డుని బద్దలు కొట్టేందుకు సమీపంలో ఉన్నాడు.
భారత్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన రెండో కెప్టెన్‌గా నిలిచేందుకు కోహ్లీ మూడు టెస్టుల దూరంలో ఉన్నాడు. భారత్ తరుపున అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్‌గా ధోని అగ్రస్ధానంలో ఉన్నాడు. ధోని నేతృత్వంలో టీమిండియా 60 మ్యాచ్‌లాడగా 27 మ్యాచుల్లో జట్టు గెలిచింది.

మూడు టెస్టులు గెలిస్తే గంగూలీ రికార్డు బద్దలు
ఆ తర్వాత గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా 49 టెస్టులకు 21 విజయాలు సాధించింది. ఇక, కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు 29 టెస్టు మ్యాచ్‌లాడగా అందులో 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో రెండు టెస్టులు గెలిస్తే గంగూలీ రికార్డుని కోహ్లీ సమం చేస్తాడు. అదే మూడు టెస్టులు గెలిస్తే గంగూలీ రికార్డుని అధిగమిస్తాడు.

భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక
ప్రస్తుతం మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడేందుకు శ్రీలంక భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే గంగూలీ రికార్డుని కెప్టెన్‌గా కోహ్లీ అధిగమిస్తాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఫిట్‌నెస్ ఇలా అన్ని విభాగాల్లో కోహ్లీసేన అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

వరుసగా 8 టెస్టు సిరిస్‌లను గెలిచిన కోహ్లీసేన
అంతేకాదు కోహ్లీ నేతృత్వంలో టీమిండియా వరుసగా 8 టెస్టు సిరీస్‌లను గెలిచి ఊపు మీద ఉంది. తొలుత శ్రీలంకను 2-1తో ఓడించిన కోహ్లీసేన ఆ తర్వాత దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, మళ్లీ శ్రీలంకపై టెస్టు సిరీస్‌లు గెలిచింది. నవంబర్ 16వ తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా లంకతో తొలి టెస్టు ఆడనుంది.

పాక్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన శ్రీలంక
ఆ తర్వాత నవంబర్ 24వ తేదీన నాగ్ పూర్‌లోని విదర్బ స్టేడియంలో రెండో టెస్టు జరగనుండగా, డిసెంబర్ 2వ తేదీన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మూడో టెస్టు జరగనుంది. స్వదేశంలో భారత్‌తో జరిగిన టెస్టు సిరిస్ ఓటమితో శ్రీలంక ప్రతీకారంతో రగిలిపోతోంది. దీంతో ఈ సారి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. భారత పర్యటనకు ముందే పాక్‌ను 2-0తో లంక క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications