Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : కోహ్లీ బెస్ట్ కెప్టెన్.. జట్టుకు విదేశాల్లో గెలవడం అలవాటు చేశాడు: రాజ్‌కుమార్ శర్మ

 Virat Kohli made winning a habit for Team India

భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఒక విజయవంతమైన కెప్టెన్ అని అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అన్నాడు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇచ్చిన ఒక పోడ్‌క్యాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ.. తన హయాంలో జట్టు వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్, వరల్డ్ టెస్టు సిరీస్ ఫైనల్స్ చేరిందని, కానీ ఐసీసీ ట్రోఫీ నెగ్గని కారణంగా తనను అందరూ ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ అన్నారని చెప్పాడు. ఇదే విషయంపై రాజ్‌కుమార్ శర్మ మాట్లాడాడు.

విదేశాల్లో డామినేట్ చేయాలని..

విదేశాల్లో డామినేట్ చేయాలని..

'కోహ్లీ రికార్డు చూస్తేనే అర్థం అవుతుంది. అతను అన్న మాటలు కరెక్టే. భారత జట్టును కోహ్లీ ఎంతో ప్యాషన్‌తో ముందుకు నడిపించాడు. తను పగ్గాలు అందుకున్న తొలి రోజు నుంచే జట్టులో కల్చరల్ మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు.

ఓవర్సీస్‌లో కూడా భారత జట్టు డామినేట్ చేయాలని ఆశించాడు. కోహ్లీ హయాంలో భారత జట్టుకు గెలవడం ఒక అలవాటుగా మారింది' అని రాజ్‌కుమార్ శర్మ కొనియాడాడు. భారత క్రికెట్‌లోని అత్యుత్తమ కెప్టెన్‌గా కోహ్లీని చాలా మంది మెచ్చుకుంటారన్నాడు.

బెస్ట్ కెప్టెన్ అన్నవారే..

బెస్ట్ కెప్టెన్ అన్నవారే..

తన జట్టు ఎగ్రెసివ్ క్రికెట్ ఆడాలని కోహ్లీ ఎప్పుడూ కోరుకునే వాడని రాజ్‌కుమార్ తెలిపాడు. 'కెప్టెన్‌గా అతను చాలా సాధించాడు. తను ఐసీసీ ట్రోఫీ గెలవకపోడం దురదృష్టకరం. భారత్ కూడా కొన్నిసార్లు దురదృష్టం వల్ల ఓడింది. ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు కూడా భారత అత్యుత్తమ కెప్టెన్ కోహ్లీ అని మెచ్చుకున్న సంగతి తెలిసిందే.

అతను ఎప్పుడూ తన కన్నా ముందు జట్టు అనుకునేవాడు. గెలవాలని, ఎగ్రెసివ్ క్రికెట్ ఆడాలని కోరుకున్నాడు' అని రాజ్‌కుమార్ తెలిపాడు. అతని ఆటతీరు కూడా అలాగే ఉండేదని, ఆలోచనలు కూడా అలాగే ఉండేవని చెప్పుకొచ్చాడు.

పేస్ బౌలింగ్‌కు పదును..

పేస్ బౌలింగ్‌కు పదును..

అలాగే కోహ్లీ హయాంలోనే భారత పేస్ బౌలింగ్ విభాగం బలంగా తయారైందని కూడా గుర్తుచేశాడు. భారత్ ఎక్కడ గెలవాలన్నా కూడా ఎప్పుడూ బ్యాటింగ్‌పై ఆధారపడేదని, కానీ కోహ్లీ వచ్చాక ఈ పరిస్థితి మారిందని చెప్పాడు. 'భారత్ ఎక్కువగా బ్యాటింగ్‌పై ఆధారపడేది.

విరాట్ తన కెప్టెన్సీలో పేసర్ల పూల్ తయారు చేశాడు. వాళ్లను ఆయుధాలుగా తయారు చేసి, చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఒకానొక సమయంలో భారత్ దగ్గర నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే ఎనిమిది మంది బౌలర్లు ఉన్నారంటే మాటలు కాదు' అని పేర్కొన్నాడు. ఇదంతా కోహ్లీ కెప్టెన్సీలోనే జరిగిందని చెప్పాడు.

Story first published: Monday, February 27, 2023, 17:13 [IST]
Other articles published on Feb 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+