ప్రపంచ క్రికెట్‌లో అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. భిన్నమైన ఫ్యాషన్స్‌ను అనుకరించడంతో పాటు ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూనే ఉంటాడు. మైదానంలో బ్యాట్‌తో పరుగుల వరద పారించడంతో పాటు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటే కోహ్లీ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ చిత్రం అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. తన స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంటున్నట్లుగా ఉన్న ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు పెయింటర్ వేసిన పెయింటింగేమోనని అనుకుంటున్నారు.
అయితే అది పెయింటర్ వేసిన పెయింటింగ్ కాదని, టెక్నాలజీని వినియోగించి మామూలు సెల్ఫీని ఈ విధంగా మార్చానని చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. గూగుల్ స్టోర్‌లోని ఓ యాప్‌ను డౌన్ లౌడ్ చేసుకుని మామూలు ఫోటోను ఇలా ఆయిల్ పెయింటింగ్ మార్చేసినట్లు కోహ్లి వెల్లడించాడు.
టెస్టు సిరిస్ కోసం ప్రస్తుతం భారత జట్టు వెస్టిండిస్‌లో పర్యటిస్తోంది. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. కోచ్‌గా కుంబ్లేకు ఈ సిరిస్ తొలి పరీక్ష. తొలి టెస్టు జూలై 21 నుంచి 25 వరకు ఆంటిగ్వాలో ప్రారంభం అవుతుండగా, జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు జమైకాలో రెండో టెస్టు జరుగనుంది.