ముంబై: భారత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. ఆయన దూకుడును చాలామంది సమర్థిస్తుంటారు. మైదానం బయట మాత్రం అతను చాలా సరదాగా ఉంటాడు. కోహ్లీకి అమ్మాయిల ఫాలోయింగా ఎక్కువే. కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
అనుష్కతో ప్రేమకు ముందు కూడా అతను పలువురు భామలతో ప్రేమ వ్యవహారం నడిపాడు. మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటి సారా జెన్ డయాస్‌తో 2011లో కోహ్లీ డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. సారా జెన్ డయాస్ తెలుగు టాప్ హీరో పవన్ కళ్యాణ్ 'పంజా' చిత్రంలో నటించింది.

ఆ తర్వాత దక్షిణాది నటి సంజనతో కోహ్లీకి అఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్యచాయి. ఓ సెల్‌ఫోన్ యాడ్‌లో కలిసి నటించిన తమన్నాతో కోహ్లీ లవ్‌లో పడ్డాడని కూడా పుకార్లు వినిపించాయి. బ్రెజిల్ మోడల్ ఇజబెల్ లీట్‌తో చక్కర్లు కొడుతూ కూడా కనిపించాడు.
లాక్మే యాడ్‌లో కనిపించిన ఇజబెల్‌తో కలిసి కోహ్లీ సింగపూర్‌లో షాపింగ్‌లకు, పబ్బులకు వెళ్లాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్‌లోనూ దర్శనమిచ్చాయి. విరాట్ స్పానిష్‌లో.. ఐ లవ్ యూ అని ఆమెకు లెటర్ కూడా రాశాడు.
కోహ్లీతో తాను రెండేళ్ల పాటు డేటింగ్ చేసినట్టు ఇజబెల్ స్వయంగా చెప్పింది. ఆ తర్వాత అనుష్క శర్మతో కోహ్లీ ప్రేమాయణం తెరపైకి వచ్చింది. తొలుత రహస్యంగా ఉన్న వీరి ప్రేమాయణం ఆ తర్వాత బయటకు వచ్చింది. ఇద్దరు కలిసి విదేశాల్లోను చక్కర్లు కొట్టారు. ఉప్పల్ స్టేడియంలో అనుష్కకు కోహ్లీ మైదానం నుంచే ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరు దూరమైన మళ్లీ కలిశారు.
అయితే, ఇదే సమయంలో హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూ యాడ్‌లో ఇలియానాతో కలిసి నటిస్తున్నప్పుడు ఆమెతో ప్రేమలో పడ్డాడనే పుకార్లు వినిపించాయి. ప్రస్తుతం అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు ఇదివరకటిలా ప్రేమలోనే ఉన్నారు. త్వరలోనే ముంబైకి మకాం మార్చాలని చూస్తున్న కోహ్లీ అక్కడ సముద్రానికి ఎదురుగా రూ.35 కోట్లతో ఇంద్రభవనం లాంటి ఒక ఫ్లాట్‌ను ఇప్పటికే కొనుగోలు చేశాడు.