న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆ క్షణాల్లో నిగ్రహం కోల్పోయి ఉండొచ్చు'

Virat Kohli lost control with fan: Viswanathan Anand on leave India controversy

కోల్‌కతా: పుట్టినరోజు సందర్భంగా కోహ్లీ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల పట్ల ఇక రూమర్లు చాలించాలని చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తెలిపారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలలోనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఔటైనప్పుడు విరాట్‌ అత్యుత్సాహం, ఒకింత తీవ్ర భావోద్వేగాలను ప్రదర్శిస్తాడని ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో అతడిని భారత్‌ విడిచిపోవాలని కోహ్లీ విమర్శించాడు. దాంతో మరో వివాదానికి దారి తీసింది.

కోహ్లీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో

కోహ్లీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో

‘ఈ తరహా వైఖరి కోహ్లీకి ఇష్టం. క్రీడల్లో చాలా వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. ఆ విమర్శ చేసినప్పుడు కోహ్లీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో? సున్నితమైన, బలహీన క్షణాల్లో ఉన్నాడేమో. ఎంత నిగ్రహంగా ఉన్నా సరే ఎప్పుడో ఓ సారి భావోద్వేగంతో కాస్త అతిగా స్పందించడమనేది సర్వ సాధారణం. నాకూ ఇలా జరగొచ్చు. ఇప్పటికే విరాట్‌పై చాలా విమర్శలొచ్చాయి. ఇక దీన్ని ఇక్కడితో ముగిస్తే మంచిది' అని ఆనంద్‌ అన్నాడు.

కోహ్లీ బ్యాటింగ్‌లో ఎలాంటి వైవిధ్యం

కోహ్లీ బ్యాటింగ్‌లో ఎలాంటి వైవిధ్యం

టాటా స్టీల్‌ చెస్‌ పోటీల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విరాట్‌ తన సొంత మొబైల్‌ ఫోన్లో ట్వీట్లు, ఇన్‌స్టాగ్రామ్‌ సందేశాలు చదువుతున్న వీడియో నవంబర్‌ 5న బయటకు వచ్చింది. అందులో ఓ వ్యక్తి కోహ్లీ బ్యాటింగ్‌లో ఎలాంటి వైవిధ్యం లేదన్నాడు. ఇంకా ఏవో వ్యాఖ్యలు చేశాడు.

దేశంలో ఉండొద్దని భావిస్తున్నా

దేశంలో ఉండొద్దని భావిస్తున్నా

‘నన్ను ఇష్టపడనందుకు బాధలేదు. మన దేశంలో మీరు ఉండొద్దని భావిస్తున్నా. నీ ప్రాధాన్యాలేంటో సరిగ్గా ఎంచుకో' అని కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. వెంటనే విరాట్‌పై భారీ స్థాయిలో విమర్శలొచ్చాయి. కొందరు అతడికి మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తనపై వచ్చిన విమర్శలపై విరాట్‌ నవంబర్‌ 8న మళ్లీ ట్విటర్‌లో స్పందించాడు.

విమర్శలు నాపై కాదనుకుంటా.

విమర్శలు నాపై కాదనుకుంటా.

ఈ విమర్శలు నాపై కాదనుకుంటా. వాటికి నేనిప్పటికీ సిద్ధంగానే ఉన్నా. ‘ఈ భారతీయులు' (thease Indians) అని ప్రత్యేకంగా నొక్కిచెప్పిన పదంపైనే నేను మాట్లాడా. ఎంపిక చేసుకొనే స్వేచ్ఛకు నేను మద్దతిస్తా. దీన్ని ఇక తేలిగ్గా తీసుకొని పండగ రోజుల్ని ఆస్వాదించండి. మీ అందరికీ ప్రేమ, శాంతి కలుగుగాక.

Story first published: Tuesday, November 13, 2018, 9:21 [IST]
Other articles published on Nov 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X