Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిగ్రహం కోల్పోయిన కోహ్లీ: ప్రెస్‌మీట్‌లో దురుసుగా ప్రవర్తన (వీడియో)

హైదరాబాద్: దక్షిణాఫ్రికా టెస్టు సిరిస్‌ను 0-2తో చేజార్చుకోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహనాన్ని కోల్పోయాడు. కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 72 పరుగుల తేడాతో ఓడిన భారత్, సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 135 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు విదేశాల్లో మెరుగైన బ్యాటింగ్ రికార్డు ఉన్న రహానేను కాదని అతడి స్థానంలో రోహిత్ శర్మకు చోటు కల్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 రహానే స్థానంలో రోహిత్ శర్మ

రహానే స్థానంలో రోహిత్ శర్మ

తొలి టెస్టు ఓటమి అనంతరం ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మకు జట్టులో చోటు కల్పించామని చెప్పిన కోహ్లీ రెండో టెస్టులో కూడా రహానే స్ధానంలో రోహిత్ శర్మనే ఆడించాడు. ఇక కీపింగ్‌ విషయానికి వస్తే వృద్ధిమాన్ సాహాను తప్పించి పార్థీవ్‌ పటేల్‌కు చోటివ్వడం, భువనేశ్వర్ కుమార్ స్ధానంలో ఇషాంత్‌కు అవకాశం ఇవ్వడంపై అటు మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సైతం మండిపడ్డారు. సెంచూరియన్ టెస్టు ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

 నిగ్రహం కోల్పోయిన కోహ్లీ

నిగ్రహం కోల్పోయిన కోహ్లీ

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నిగ్రహం కోల్పోయిన కోహ్లీ ఘాటుగా బదులిచ్చాడు. ఆటలో గెలుపు ఓటములు సాధారణమే అయినా ఓడిన తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పాడు. తుది జట్టను ఎంచుకోవడంలో సెలక్షన్‌ కమిటీ, కోహ్లీ విఫలమవుతున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చాడు.

జట్టును మీరే సెలక్ట్‌ చేయండి

'ఒకవేళ మేం గెలిచి ఉంటే బెస్ట్‌ 11 అన్న ప్రస్తావన వచ్చేదా? ఫలితం ప్రకారం తుది జట్టును నిర్ణయించలేం. ఊరికే కూర్చుని మాట్లాడటం కాదు. మైదానంలో దిగితే తెలుస్తుంది. ఇకపై జట్టును మీరే సెలక్ట్‌ చేయండి. మేం ఆడతాం' అంటూ కోహ్లీ అన్నాడు. ఇక, రహానే, భువీలను పక్కనపెట్టడంపై కూడా కోహ్లీ స్పందించాడు.

మీడియాకు కోహ్లీ హితవు పలికిన కోహ్లీ

మీడియాకు కోహ్లీ హితవు పలికిన కోహ్లీ

ఆయా నిర్ణయాలు ఊరికే తీసుకోలేదని.. వాటిపై అనవసరంగా రాద్ధాంతం చెయ్యకండని మీడియాకు కోహ్లీ హితవు పలికాడు. ‘ఏదైనా నిర్ణయం ఫలితాన్నివ్వనప్పుడు జనం దానికి వ్యతిరేకంగా మాట్లాడడం సహజం. మేం దానికి అలవాటు పడ్డాం. బయట ఎవరేమనుకుంటున్నారో మేం పట్టించుకోం. భువనేశ్వర్‌ను తప్పించడంపై చాలా మాట్లాడారు. కానీ ఈ మ్యాచ్‌లో షమి మెరుగ్గా రాణించాడు. దాని గురించి ఎవరూ మాట్లాడరు. మేం పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం' అని అన్నాడు.

 మేం ఇప్పటిదాకా 34 టెస్టులు ఆడాం

మేం ఇప్పటిదాకా 34 టెస్టులు ఆడాం

తుది జట్టులో మార్పుల మూలంగానే జట్టు ఓటమి పాలవుతుందా? అన్న మరో ప్రశ్నకు కూడా కోహ్లీ అదే రీతిలోనే బదులిచ్చాడు. 'మేం ఇప్పటిదాకా 34 టెస్టులు ఆడాం. అందులో గెలిచినవి 21 మ్యాచ్‌లు(నిజానికి 20 మాత్రమే గెలిచింది). రెండే రెండు ఓడిపోయాం. మిగతావి డ్రాగా ముగిశాయి. గెలుపు కోసం మా శక్తి మేర ప్రయత్నిస్తాం. జట్టు మార్పులు విజయాలపై ప్రభావం చూపవు. నా టీమ్‌మేట్స్‌ను మభ్య పెట్టడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. అయినా నేను ఇక్కడికి సమాధానాలు చెప్పటానికి మాత్రమే వచ్చాను. మీతో గొడవ పడటానికి కాదు' అని కోహ్లీ అన్నాడు.

మేం ఎప్పుడూ విజయం కోసం ప్రయత్నిస్తాం

మేం ఎప్పుడూ విజయం కోసం ప్రయత్నిస్తాం

'చివరికి ఓ జట్టు ఓడిపోవాలి. ఒక జట్టుగా మేం ఎప్పుడూ విజయం కోసం ప్రయత్నిస్తాం. మనం ఓటమిని అంగీకరించవచ్చు. కానీ ఓడిన తీరును కాదు. మ్యాచ్‌లో మేం మంచి అవకాశాలను చేజార్చుకున్నాం. చాలా వికెట్లు తేలిగ్గా ఇచ్చేశాం. ఎంతో కష్టపడి, మంచి స్థితిలో నిలిచాక ఇలాంటి తప్పిదాలతో మ్యాచ్‌ మాకు దూరమైంది' అని కోహ్లీ చెప్పాడు.

 ఆటగాళ్లు తమను తాము ప్రశ్నించుకోవాలి

ఆటగాళ్లు తమను తాము ప్రశ్నించుకోవాలి

ఈ టెస్టు సిరిస్లో ఎక్కడ తప్పు జరిగిందనే విషయంలో ఆటగాళ్లు తమను తాము ప్రశ్నించుకోవాలని కోహ్లీ అన్నాడు. 'ఇలా ఆడేందుకు మేమిక్కడికి రాలేదు. నేనేమీ ఈ వైఫల్యం విషయంలో మెతకగా వ్యవహరించబోను. బ్యాటుతో, బంతితో, ఫీల్డింగ్‌లో జట్టు కోసం మేం 120 శాతం శ్రమిస్తున్నామా అని మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి' అని కోహ్లీ అన్నాడు. బౌలర్లు తమ కర్తవ్యాన్ని బాగానే నిర్వర్తించారు. కానీ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిపోయామని కోహ్లీ చెప్పాడు.

Story first published: Thursday, January 18, 2018, 10:49 [IST]
Other articles published on Jan 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+