రెండో టెస్ట్ ముందు కోహ్లీని భయపెడుతున్న చెత్త రికార్డు!!

క్రైస్ట్‌చర్చ్: నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గా ఆశించిన స్థాయిలో విజయాలందుకోలేకపోతున్నాడు. అతని వ్యక్తిగత ప్రదర్శన జట్టు విజయాలపై కూడా ప్రభావం చూపుతోంది. సొంతగడ్డపై వరుస విజయాలతో జ్రైతయాత్రను కొనసాగించిన కోహ్లీ.. వీదేశీ గడ్డపై మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్.. టీ20 సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసి ఘన ఆరంభాన్ని అందుకున్నా.. తర్వాత మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో చేజార్చుకుంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లోను తొలి మ్యాచ్ ఓడి 0-1తో వెనుకంజలో నిలిచింది. సిరీస్‌ను కాపాడుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకొంది.

తప్పక గెలవాలి..

తప్పక గెలవాలి..

శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ రెండో టెస్టులో విజయం సాధించాలని కోహ్లీ సేన ఎంతో పట్టుదలతో ఉంది. మరీ ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఈ గెలుపు ఎంతో అవసరం. విదేశాల్లో అత్యధిక టెస్టు ఓటముల టీమిండియా కెప్టెన్ల జాబితాలో మరింత దిగజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. కోహ్లీ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాక భారత్.. ఓవర్సీస్‌లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడింది. అందులో 9 టెస్టులు ఓడిపోగా 4 మాత్రమే గెలిచింది. మిగతా రెండు డ్రా అయ్యాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ ఆస్ట్రేలియాలో పర్యటించిన కోహ్లీసేన ఎప్పుడూ అన్ని టెస్టులు ఓడిపోలేదు. సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచైనా గెలుపొందింది. తాజా కివీస్‌ పర్యటనలో రెండు టెస్టులే ఉండగా న్యూజిలాండ్‌ ఇప్పటికే తొలి మ్యాచ్‌ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రెండో టెస్టులో గెలవకపోతే.. కోహ్లీ కెప్టెన్సీ ఖాతాలో చెత్త రికార్డు చేరుతుంది.

గంగూలీని అధిగమించనున్న కోహ్లీ..

గంగూలీని అధిగమించనున్న కోహ్లీ..

మహేంద్రసింగ్‌ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు భారత్ విదేశాల్లో అత్యధికంగా 15 టెస్టులు ఓడిపోయింది. దీంతో ఈ జాబితాలో అతడు అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ తర్వాత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లీ చెరో 10 ఓటములతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఒకవేళ భారత్‌ క్రైస్ట్‌చర్చ్‌లో ఓడితే.. గంగూలీని అధిగమించి కోహ్లీ 11 ఓటములతో రెండో స్థానానికి చేరుకుంటాడు. అలా జరగకూడదంటే కోహ్లీసేన రెండో టెస్టులో తప్పక గెలవాలి.

కలవరపెడుతున్న ఫామ్..

కలవరపెడుతున్న ఫామ్..

ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్ కలవరపెడుతుంది. తొలి టెస్టులో కేవలం 21 పరుగులే చేసిన రన్ మెషిన్.. వన్డే సిరీస్‌లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఫలితంగా భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలి టెస్ట్ ఓటమికి పూర్తిగా బ్యాటింగ్ వైఫల్యమే కారణం కాగా.. తర్వాతి మ్యాచ్‌లోనైనా ఎలా రాణిస్తారో చూడాలి. టాపార్డర్, మిడిలార్డర్ సమష్టిగా చెలరేగితేనే భారత్‌కు గెలిచే అవకాశం ఉంది. లేదంటే.. భారత్‌ ఘోర పరాభావాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, February 27, 2020, 14:11 [IST]
Other articles published on Feb 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X