భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మైదానంలో బ్యాట్ తో సృష్టించే సంచలనాలు ఒకెత్తయితే.. సోషల్ మీడియాలో కోహ్లీ చేసే చిన్న పని కూడా నేషనల్ ట్రెండ్‌గా మారుతుంటుంది. తాజాగా విరాట్ కోహ్లీ ఓ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోను లైక్ చేయడం ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. జర్మన్-సౌత్ ఆఫ్రికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ ఫోటోపై విరాట్ కోహ్లీ లైక్ పడటంతో అభిమానులు రకరకాల కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ఎవరీ లిజ్‌లాజ్? భారత్‌తో ఆమెకు ఉన్న బంధం ఏంటి?
లిజ్‌లాజ్ అసలు పేరు జెన్నిఫర్. ఆమె కేవలం ఓ గ్లామర్ మోడల్ మాత్రమే కాదు, సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేసిన విద్యావంతురాలు. ట్రావెల్ వ్లాగర్, సింగర్‌గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. గతంలో ఆమె పాడిన 'సమోసా సమోసా' అనే పాట భారత్‌లో బాగా వైరల్ అయ్యింది. అంతేకాకుండా బెంగళూరు ట్రాఫిక్ కష్టాలను సరదాగా వివరిస్తూ ఆమె చేసిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. జర్మన్, డచ్ భాషలతో పాటు భారతీయ సంస్కృతి పట్ల ఆమెకు ఉన్న మక్కువ ఆమెను భారతీయ అభిమానులకు దగ్గర చేసింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ లైక్ చేయడంతో ఆమె ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

పాత 'అల్గారిథమ్' వివరణను గుర్తుచేస్తున్న ఫ్యాన్స్
విరాట్ కోహ్లీ ఈ ఫోటోను లైక్ చేయగానే నెటిజన్లు గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో నటి అవనీత్ కౌర్ ఫోటోను కూడా విరాట్ ఇలాగే లైక్ చేశారు. అప్పట్లో అది పెద్ద వివాదంగా మారడంతో విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఓ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు 'అల్గారిథమ్ గ్లిచ్' కారణంగా ఆటోమేటిక్‌గా లైక్ రిజిస్టర్ అయ్యిందని.. తనకు ఎటువంటి ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు లిజ్‌లాజ్ విషయంలో కూడా అదే 'అల్గారిథమ్' సాకును వాడుతూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం.. అకాయ్ పేరుతో జోకులు
ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది సరదాగా "విరాట్ భయ్యా.. అకాయ్ (కుమారుడు) చేతిలో నుంచి ఫోన్ తీసేయండి, లేదంటే అల్గారిథమ్ పేరుతో మరో పారాగ్రాఫ్ వివరణ ఇవ్వాల్సి వస్తుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు "కింగ్ కోహ్లీని కనీసం ఒక లైక్ కూడా చేసుకోనివ్వరా?" అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా ఐపీఎల్ 2026 సీజన్‌లో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ, ఈ చిన్న లైక్ ద్వారా మరోసారి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు.
ఇది కేవలం టెక్నికల్ ఇష్యూనేనా?
అయితే విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీల ఖాతాలను మేనేజ్ చేసేటప్పుడు లేదా యాప్ వాడుతున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగడం సహజమేనని వారు వాదిస్తున్నారు. దీనిని వ్యక్తిగత ఇష్టంతో ముడిపెట్టడం సరికాదని, కేవలం ఒక 'లైక్' ను ఇంతగా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో నుంచి కోహ్లీ లైక్ తొలగించబడినట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. అప్పటికే జరిగిన వైరల్ రచ్చ మాత్రం తగ్గడం లేదు.