న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫోర్బ్స్ జాబితా: ఆదాయం సంపాదనలో ధోని రికార్డుకి చేరువలో కోహ్లీ!

Virat Kohli Likely to Surpass MS Dhoni As The Highest Earning Indian Sportsman Ever| Oneindia Telugu
Virat Kohli likely to surpass MS Dhoni as India’s highest earning sportsman

హైదరాబాద్: భారత్‌లో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్న ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనిని(ఆదాయం పరంగా) అధిగమించేలా కనిపిస్తున్నాడు. ప్రపంచంలోనే హై ప్రొఫైల్ కలిగిన అథ్లెట్లలో ఒకడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

కోహ్లీ ఇప్పటికే టిస్సాట్, ఆడి, పుమా, ఉబెర్, హీరో లాంటి 21 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. దీంతో 2018లో అత్యధిక మొత్తం సంపాదిస్తోన్న 100 మంది జాబితాను ఫోర్బ్స్ విడుదల చేయగా అందులో విరాట్ కోహ్లీ సైతం చోటు దక్కించుకున్నాడు.

24 మిలియన్ డాలర్లతో 83వ స్థానంలో నిలిచిన కోహ్లీ

24 మిలియన్ డాలర్లతో 83వ స్థానంలో నిలిచిన కోహ్లీ

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మొత్తం 24 మిలియన్ డాలర్లతో 83వ స్థానాన్ని దక్కించుకున్నాడు. కోహ్లీ మొత్తం సంపాదనలో 20 మిలియన్ల ఆదాయం ప్రకటనల ద్వారా వస్తుండగా, 4 మిలియన్ల ఆదాయం జీతం, ప్రైజ్‌మనీల ద్వారా లభిస్తోంది. భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న క్రికెటర్‌గా మాత్రమే కాదు... టాప్ అథ్లెట్లు నోవాక్ జొకోవిచ్, సెర్గియా ఆగ్విరో లాంటి వారి కంటే కోహ్లీ ముందు ఉన్నాడు.

కోహ్లీ దూకుడు చూస్తుంటే

కోహ్లీ దూకుడు చూస్తుంటే

కోహ్లీ దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న బాక్సింగ్ దిగ్గజం ప్లాయిడ్ మేవెదర్, లియోనల్ మెస్సీలకు ఛాలెంజ్ విసిరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాగా, ఇప్పటివరకు ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో భారత్ నుంచి ఎక్కువ ఆదాయం సంపాధించిన ఆటగాళ్ల జాబితాలో ధోని(31 మిలియన్ డాలర్లు) ముందంజలో ఉన్నాడు.

2015లో 31 మిలియన్ డాలర్లు సంపాదించిన ధోని

2015లో 31 మిలియన్ డాలర్లు సంపాదించిన ధోని

2015లో ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో మహేంద్ర సింగ్ ధోని మొత్తం 31 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాధించి అప్పటి జాబితాలో చోటు దక్కించుకున్నాడు. దీనిని బట్టి చూస్తే ధోని కంటే సంపాదనలో విరాట్ కోహ్లీ మరో 7 మిలియన్ డాలర్ల వెనుకంజలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఇదే ఫామ్‌ని కొనసాగిస్తే సంపాదనలో ధోనిని తప్పక మించిపోతాడు.

కోహ్లీని ఓ రోల్ మోడల్‌గా

కోహ్లీని ఓ రోల్ మోడల్‌గా

ఇప్పటికే భారత యువత కోహ్లీని ఓ రోల్ మోడల్‌గా ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఆసీస్ పర్యటనలో ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా సమం చేసింది. తొలి టీ20లో ఆతిథ్య జట్టు నెగ్గగా... మూడో టీ20లో భారత్ విజయం సాధించింది.

డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్

డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్

వర్షం కారణంగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20 రద్దైంది. డిసెంబర్ 6 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌లో గనుక విరాట్ కోహ్లీ రాణిస్తే తన బ్రాండింగ్ వాల్యూని మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ జరగనుంది.

సోషల్ మీడియాలో కోహ్లీదే హవా

సోషల్ మీడియాలో కోహ్లీదే హవా

సోషల్ మీడియా వేదికల్లో కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానించే నెటిజన్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు. ఫేస్‌బుక్‌లో కోహ్లీని 37 మిలియన్ అభిమానులు ఫాలో అవుతుండగా... ఇనిస్టాగ్రామ్‌లో 25 మిలియన్, ట్విట్టర్‌లో 27.1 మిలియన్ ఫాలో అవుతుండటం విశేషం.

Story first published: Tuesday, November 27, 2018, 15:22 [IST]
Other articles published on Nov 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X